iBomma Ravi: 90 రోజుల జైలు జీవితం.. చంచల్‌గూడ జైలు నుంచి ఐ బొమ్మ రవి విడుదల..

Ibomma Ravi Bail

Ibomma Ravi Bail

iBomma Ravi: చంచల్ గూడా జైలు నుంచి ఐ బొమ్మ రవి విడదలయ్యాడు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఐబొమ్మ రవి బయటకు వచ్చాడు. పోలీసులు ఐ బొమ్మ రవిపై ఐదు సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.. సుమారు 90 రోజులపాటు జైలులో ఉన్న రవి తాజాగా విడదలయ్యాడు.. విడుదల అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెనుతిరిడాడు ఐ బొమ్మ రవి. ఈ అంశంపై ఐ బొమ్మ రవి అడ్వకేట్ గోపీంద్రనాథ్ మాట్లాడుతూ.. “ఇమ్మడి రవికి 12 షరతులతో కూడిన బెయిల్ వచ్చింది.. బెయిల్ ఆర్డర్ కాపీని జైలు సూపరింటెండెంట్‌కు అందించాం.. తాజాగా ఇమ్మడి రవి బయటకు వచ్చాడు. ఇండియా వదిలి పెట్టి వెళ్ళవద్దని కోర్టు చెప్పింది.. కరేబియన్ దీవుల పౌరుడిగానే కోర్టు గుర్తించింది. రోజు సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణ హాజరు కావాలని తెలిపింది. సోషల్ మీడియా అకౌంట్స్ వాడవద్దని కండిషన్ విధించింది. ఇంటర్ నెట్, వీఎన్‌పీ వాడవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఇంటర్నెట్ వాడాలి అనుకుంటే పోలీసుల అనుమతి తీసుకొని పోలీసుల ఎదుటే వాడాలనే కండీషన్ పెట్టింది.” అని వెల్లడించారు.

READ MORE: IND vs NED: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. డచ్ జట్టుపై పరుగుల వేటకు ‘సూర్య’ సేన సిద్ధం!