Site icon NTV Telugu

Ibomma Ravi: మూడేళ్లలో రూ.13 కోట్ల సంపాదన, ఫేక్ డాక్యుమెంట్లతో 3 కంపెనీలు.. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు..!

Ibomma Ravi

Ibomma Ravi

Ibomma Ravi: ఐబొమ్మ రవి వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో అతడి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం మూడు సంవత్సరాల్లోనే ఐబొమ్మ రవి సుమారు రూ.13 కోట్ల ఆదాయం సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మొత్తంలో దాదాపు రూ.10 కోట్లు విలాసవంతమైన జీవనశైలికి ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైఫై పబ్‌లు, 5 స్టార్ హోటళ్లలోనే బస చేస్తూ లగ్జరీ లైఫ్ గడిపినట్టు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం రవి అకౌంట్లలో ఉన్న రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.

PAN–Aadhaar Linking Deadline: పాన్ – ఆధార్ లింక్‌ గడువును మరోసారి పొడిగిస్తారా..?

పోలీసుల వివరాల ప్రకారం.. 2007 నుంచే ఐబొమ్మ రవికి పైరసీ చేయాలనే ఆలోచన ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి తన స్నేహితుల సర్టిఫికెట్లు చోరీ చేస్తూ అక్రమాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రవి తన స్నేహితులైన ప్రహ్లాద్, అంజయ్య, కాళీ ప్రసాద్ల ఐడెంటిటీ ప్రూఫ్‌లను వారి తెలియకుండానే దొంగిలించాడు. ఆ డాక్యుమెంట్లపై తన ఫోటో అమర్చుకుని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించాడు. ప్రహ్లాద్ డాక్యుమెంట్లతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

Free Rides For Drinkers: మద్యం ప్రియులకు శుభవార్త.. మద్యం సేవించినవారికి ఉచిత రవాణా సేవలు..!

ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా ఐబొమ్మ రవి మొత్తం మూడు కంపెనీలు స్థాపించినట్లు పోలీసులు వెల్లడించారు. Supplier India, Hospital Inn, ER Infotech పేర్లతో మూడు కంపెనీలను సృష్టించాడు. అయితే ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న రామగుండంకు చెందిన అంజయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. విచారణలో భాగంగా రవి, టెలిగ్రామ్ నుంచి ‘తండెల్’, ‘కిష్కిందపురి’ సినిమాలను తీసుకున్నట్టు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

Exit mobile version