Site icon NTV Telugu

IBomma Ravi: బెట్టింగ్ యాప్.. టెక్ కంపెనీలకు CEOగా రవి.. తవ్వేకొద్దీ వెలుగులోకి సంచలన విషయాలు..

Ravi

Ravi

IBomma Ravi: ఐ-బొమ్మ నిర్వాహకుడు రవి అంశంలో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రవి గెట్టింగ్ అప్, ER ఇన్ఫోటెక్ కంపెనీలకు CEOగా ఉన్నట్లు తెలిసింది. తన టీంతో కలిసి UK నుంచి సర్వర్లు హ్యాకింగ్ చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ముంబైలో MBA పూర్తి చేశాడు.. లవ్ మ్యారేజ్ చేసుకుని కొన్ని రోజులకే భార్యతో విడిపోయాడు. కూకట్‌పల్లిలోని రెయిన్బో విస్టాలో నివాసం ఉంటున్నాడు.. VPNతో లొకేషన్లు మారుస్తూ.. వెబ్సైట్‌లో సినిమాలు అప్లోడ్ చేశాడు.. పైరసీ సినిమాల అప్లోడ్ కోసం 100కి పైగా వెబ్సైబ్‌లు కొనుగోలు చేశాడు. పైరసీ బయటపడి ఒక వెబ్సైట్ తొలగించినా.. మరో వెబ్సైట్‌ను వాడుకుంటూ సినిమాలు అప్లోడ్ చేస్తున్నాడు. రవి ఇంట్లో స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డెస్క్‌లలో 2 వేలకు పైగా సినిమాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పైరసీ నెట్‌వర్క్‌ను ప్రపంచ స్థాయిలో విస్తరించాడు.. కాగా.. ప్రస్తుతం కూకట్‌పల్లిలోని ఇంట్లో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి తరలించారు. ఇప్పటికే రవిపై 7 కేసులు నమోదు చేశారు పోలీసులు..

READ MORE: DK Shivakumar: డీకే.శివకుమార్ రాజీనామా అంటూ పుకార్లు! కర్ణాటకలో ఏం జరుగుతోంది!

Exit mobile version