IAS Smita Sabharwal: మాజీ ఐఏఎస్ బాలలతకు సెటైర్ వేసిన స్మితా..

  • మాజీ ఐఏఎస్ బాలలతకు తాజాగా ఐఏఎస్ స్మితా సెటైర్.
  • తనతో సివిల్స్ పరీక్ష రాయడానికి స్మిత సిద్ధమా అంటూ బాలలత సవాల్.
  • పరీక్షలు రాసేందుకు తాను సిద్ధమే కానీ.. వయస్సు పెరిగిన దృష్ట్యా యూపీఎస్సి అనుమతించదేమో అని స్మితా ట్విట్.
Ias Smita Sabharwal Tweet On Ex Ias Officer Balalatha

Ias Smita Sabharwal Tweet On Ex Ias Officer Balalatha

IAS Smita Sabharwal Tweet On Ex IAS Officer balalatha: మాజీ ఐఏఎస్ బాలలతకు తాజాగా ఐఏఎస్ స్మితా సెటైర్ వేసింది. సోమవారం నాడు తనతో సివిల్స్ పరీక్ష రాయడానికి స్మిత సిద్ధమా అంటూ బాలలత సవాల్ చేసిన సంగతి తెలిసిందే. తనతో పాటు స్మిత సభర్వాల్ సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు బాలలత తెచ్చుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా ఐఏఎస్ స్మిత సభర్వాల్ ఘాటుగా స్పందించింది. సివిల్స్ పరీక్షలు రాసేందుకు తాను సిద్ధమే కానీ.. వయస్సు పెరిగిన దృష్ట్యా యూపీఎస్సి అనుమతించదేమో అని స్మితా ట్విట్ చేసింది. ఇక ఈ ట్వీట్ లో బాలలతను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది.

Budget 2024 : బడ్జెట్ టాబ్లెట్‌తో కెమెరాలకు ఫోజులిచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

దివ్యంగుల కోటాలో బాలలత తన ప్రత్యేక హక్కును దేనికి ఉపయోగించింది..? కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను నడపడానికా..? లేక ఫీల్డ్ వర్క్ ద్వారా ప్రజలకు సేవ చేయడానికా..? అంటూ ఓ నెటీజన్ ను స్మితా సబర్వాల్ ప్రశ్నించింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Gold Price Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. వారం రోజుల్లో ఐదోసారి!