NTV Telugu Site icon

CS Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్‌ కుమార్ ప్రసాద్.

Cs Neerabh Kumar Prasad

Cs Neerabh Kumar Prasad

CS Neerabh Kumar Prasad: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేసినట్టు పేర్కొంది ప్రభుత్వం.. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌.. ప్రస్తుతం ఏపీ పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతికశాఖ స్పెషల్‌ సీఎస్‌గా పనిచేస్తున్నారు.. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.. అయితే, తన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ జవహర్ రెడ్డి చేతుల మీద జరపడానికి చంద్రబాబు విముఖతతో ఉన్నారని.. అందుకే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లినా.. తాజా ఉత్తర్వుల్లో బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది..

Read Also: Parliament: పార్లమెంట్లోని అంబేద్కర్, గాంధీ విగ్రహాల స్థానాల్లో మార్పులు.. కాంగ్రెస్ ఫైర్..!

ఇక, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్.. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌.. ఇక, ఈ రోజు ఆయన్ను సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి.. ఇక, ఈ నెల 30న రిటైర్ కానున్న నీరభ్ ప్రసాద్ పదవీవిరమణ చేయనున్నారు.. అయితే, ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ.. అక్కడికే ఆయన సేవలకు పులిస్టాప్‌ పెట్టనుందా చూడాలి. కాగా, ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి పూర్తి స్థాయిలో సహకరించారనేది జవహర్ రెడ్డి మీదున్న అభియోగం. జవహర్ రెడ్డిని తప్పించాలని ఎన్నికల సమయంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి చాలా సార్లు ఫిర్యాదు చేశాయి కూటమి పార్టీలు. ఇక, కూటమి విజయం తర్వాత చంద్రబాబును జవహర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసినా.. ఆయనతో ఇతర విషయాలేమీ చర్చించడానికి చంద్రబాబు ఇష్టపడనట్టుగా తెలిసింది.. ఆ తర్వాత ఆయన సెలవుపై వెళ్లినా.. తాజా ఉత్తర్వుల్లో జవహర్‌రెడ్డిని బదిలీ చేస్తున్నట్టు పేర్కొంది ప్రభుత్వం. మరోవైపు.. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలు ఉంటాయనే చర్చ సాగుతోంది.

Show comments