Rajasthan: పొలంలో కుప్పకూలిన జాగ్వార్ ఫైటర్ జెట్.. 5 నెలల్లో కూలిన మూడో విమానం..
- రాజస్థాన్ చురు జిల్లాలో కుప్ప కూలిన జాగ్వార్ ఫైటర్ జెట్
- భారత వైమానిక దళం (IAF) కు చెందిన ఇద్దరు పైలట్లు మృతి
- గత ఐదు నెలల్లో మూడో సారి కూలిన జాగ్వార్ విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లోని చురు జిల్లాలోని భానుడా గ్రామం సమీపంలో బుధవారం జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్ప కూలింది. ఈ ఘటనలో భారత వైమానిక దళం (IAF) కు చెందిన ఇద్దరు పైలట్లు మరణించారు. గత ఐదు నెలల్లో జాగ్వార్ విమానాలు కూలిపోవడం ఇది మూడో సారి అని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానం ఓ పొలంలో కూలింది. పైలట్ల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. ఈ ప్రమాద ఘటనను భారత వైమానిక దళం ధ్రువీకరించింది. “ఒక సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజస్థాన్‌లోని చురు సమీపంలో ఒక ఐఏఎఫ్ జాగ్వార్ శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. పౌర ఆస్తికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి విచారణ కోర్టును ఏర్పాటు చేస్తున్నాం. పైటర్ల మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తాం” అని ప్రకటన పేర్కొంది.
READ MORE: Kinjarapu Atchannaidu: జగన్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?.. అచ్చెన్నాయుడు ఫైర్!
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
భానుడా గ్రామంలోని వ్యవసాయ పొలంలో మధ్యాహ్నం 1:25 గంటల ప్రాంతంలో విమానం కూలిపోయిందని స్థానిక పోలీసు అధికారి రాజల్దేశర్ కమ్లేష్ మీడియాకు తెలిపారు. ప్రమాద స్థలం సమీపంలో శరీర భాగాలు చెల్లాచెదురుగా కనిపించాయని వెల్లడించారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యాపించాయి.. ఆకాశం నుంచి పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తర్వాత పొలాల నుంచి మంటలు, పొగలు ఎగసి పడ్డాయని గ్రామస్థులు తెలిపారు. మంటలు ఆర్పేందుకు యత్నించినట్లు గ్రామస్థులు చెప్పారు. సమాచారం అందిన వెంటనే.. జిల్లా కలెక్టర్ అభిషేక్ సురానా, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడానికి, దర్యాప్తులో సహాయం చేయడానికి ఆర్మీ రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంటుంది. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!