గన్నవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి నాకు స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన నియోజకవర్గ ప్రజలు, టీడీపీ- జనసేన- బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ.. సైకిల్ గుర్తుపై ఓటేసి అరాచక పాలనకు చరమగీతం పాడాలని కోరారు.
Read Also: Delhi: ఇండియా గేట్ వద్ద ఐస్ క్రీం విక్రేత దారుణ హత్య.. నిందితుడు అరెస్ట్
ఇక, నా నామినేషన్ కార్యక్రమాన్ని ఎన్టీవీలో టెలికాస్ట్ చేసినందుకు నా నమస్కారములు తెలియజేస్తున్నాను అని టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ చెప్పారు. రాబోయే కాలంలో గన్నవరం ప్రజలు అన్యాయాన్ని సహించరు.. నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి అధికార పార్టీ శ్రేణులు కూడా తరలి వచ్చారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇంత ఎండలో వేల సంఖ్యలో ప్రజలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను.. చంద్రబాబు కన్నీటికి కారణమైన గన్నవరం నియోజకవర్గంలో నా విజయంతో ప్రజలు చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తారని నమ్ముతున్నాను అని యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.