Balineni Srinivasa Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు.. ఇవే నా చివరి ఎన్నికలు.. నేను చివరి సారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని తెలిపారు. అయితే, వచ్చే ఎన్నికల్లో మా అబ్బాయి పోటీ చేస్తారు అని వెల్లడించారు. నేను పట్టాల కోసం వెళ్లి కూర్చుంటే పార్టీ మారుతున్నానని రకరకాల వార్తలు వచ్చాయి.. మీ అందరి దయతో తిరిగి ఒంగోలులోనే పోటీ చేస్తున్నాను అని స్పష్టం చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, నేను కలసి పోటీ చేస్తానని చాలాసార్లు చెప్పా.. ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.. దేవుడి దయ వల్ల అది సాధ్యపడుతుందని భావిస్తున్నాను అన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ఏపీలో మరోసారి వైసీపీ జెండా ఎగరటానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు బాలినేని.
Read Also: YS SHarmila: మాజీ మంత్రి కొణతాల ఇంటికి వైఎస్ షర్మిల.. మేం అంతా కుటుంబ సభ్యులం..
ఒంగోలులో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వలేకుంటే పోటీ కూడా చేయనని చెప్పాను అని గుర్తుచేసుకున్నారు బాలినేని.. చాలామంది అలా ఎందుకు చెప్పారని వారించినా.. ఒంగోలు ప్రజలకు చేసిన వాగ్దానం నెరవేర్చకుంటే రాజకీయాలు మానుకుంటానని చెప్పా.. అది సాధించానని ఆనందం వ్యక్తం చేశారు. పేదల స్ధలాల కోసం 231 కోట్ల రూపాయలు విడుదల చేసిన సీఎం జగన్ కు ధన్యావాదాలు తెలిపిన ఆయన.. 25 వేలమందికి పట్టాలు ఇవ్వటమే కాదు.. ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు కృషి చేస్తాను అన్నారు. మౌళిక సదుపాయాల కల్పన పూర్తిచేసి వచ్చే నెల 10వ తేదీలోపు సీఎం జగన్ చే ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. రాష్ట్రమంతా జగనన్న కాలనీలు వచ్చినా.. ఒంగోలులో టీడీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ భగవంతుడి దయ.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దయ వల్ల ఇళ్ల స్ధలాలకు డబ్బులు వచ్చాయంటూ సంతోషం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.