నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలం రావుల కొల్లు సర్పంచ్ వెంగపనాయుడు ఇచ్చిన విందులో ఉదయగిరి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ముందుగా గ్రామ దేవత అయిన సీతాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడికి వచ్చిన గ్రామ నాయకులు ప్రజలతో మాట్లాడుతూ ఓటు అనే ఆయుధంతో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని ఆయన కోరారు. తెలుగుదేశం గెలిస్తే మీరు నేను గెలిచినట్టే అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అదే విధంగా యువతకు ఉద్యోగాలు కావాలంటే బాబు రావాలన్నారు. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రంగా, అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా తయారైందని కాకర్ల సురేష్ తెలిపారు.
Read Also: Asaduddin Owaisi: భారత్లో పేదలు, ముస్లీంలు లేకుండా చేయాలని చూస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఓటు ద్వారా విజయం సాధిద్దాం.. అదే విధంగా అజాతశత్రువు సేవకుడు అయినటువంటి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఉదయగిరిని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతానని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండల కన్వీనర్ బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, కాకర్ల సునీల్, కాకర్ల వెంకట్ నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు తెలుగుదేశం- జనసేన- బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Read Also: NIA: పశ్చిమ బెంగాల్ ఎన్ఐఏ అధికారులపై దాడి.. ఇద్దరికి గాయాలు, కారు ధ్వంసం
అలాగే, ఉదయగిరి మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన మాజీ మండల కన్వీనర్ బొజ్జ నరసింహులు తమ్ముడు బొజ్జ నరసయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఉదయగిరిలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడని తెలుసుకున్న ఉదయగిరి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వైద్యశాలలోనికి వెళ్లి బాధితున్ని పరామర్శించారు. డాక్టర్ సలహాలు సూచనలు పాటించి త్వరగా కోలుకోవాలని ధైర్యంగా ఉండాలని తెలిపారు.