నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల తర్వాత నాగార్జునసాగర్ లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం నా అదృష్టమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు మొదటి వారంలో ఎడమ కాలువకు సాగు నీటిని విడుదల చేశామని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ ను నాశనం చేసిందని, గత ప్రభుత్వం కొత్త అయకట్టును పెంచలేదన్నారు. గత పదేళ్ళలో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టు లు కుంటుపడ్డాయని, ప్రతీ ఏడాది ఆరు నుండి ఆరున్న లక్షల కొత్త ఆయకట్టు తయారు చేస్తామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిదికన అన్ని పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్ లా ఉంటాయని, BRS వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంలా ఉంటాయన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Uttam Kumar Reddy : ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం నా అదృష్టం

Uttamkumar Reddy