NTV Telugu Site icon

Pulivarthi Nani: నాపై దాడి జరిగింది.. పులివర్తి నాని వీడియో ప్రజంటేషన్

New Project (42)

New Project (42)

చెవిరెడ్డి ఒక అపరిచితుడని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై జరిగిన దాడి, చెవిరెడ్డి కామెంట్స్ పై మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమ్మెటతో కొట్టడం వల్ల నా తల, భుజం పై గాయాలు అయ్యాయన్నారు. దాడి నాపైనే జరిగింది.. నన్ను చంపాలని చూశారన్నారు.
నామినేషన్ రోజు వైసీపీ నేతలే రాళ్లు వేశారని ఆరోపించారు. ఆ రోజు తన కోడలుపై దాడి చేయాలని చూశారన్నారు. 2014 నుంచి చెవిరెడ్డి చంద్రగిరిలో దొంగ ఓట్లతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఉన్నది ఒక్క క్వారీ మాత్రమే అని.. దానికి 50 కోట్ల రూపాయల ఫైన్ వేయించి నన్ను ఆర్థికంగా దెబ్బతీశారన్నారు. నీలాగా నేను ఎర్రచందనం వ్యాపారం చేయలేదని చెప్పారు.
వ్యక్తిగతంగా నేను, మా కుటుంబం చెవిరెడ్డి ని దూషించలేదని స్పష్టం చేశారు. చెవిరెడ్డిని మించిన నటుడు దేశంలో లేరని విమర్శించారు. కరోనా సమయంలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.

READ MORE: Sowmya Accident : అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన మరో తెలుగు బిడ్డ..

కాగా.. తనపై దాడి విషయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని డ్రామా చేశారంటూ ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”నామినేషన్ రోజు నాపై దాడి చేశారు. మహిళా యూనివర్సిటీ వద్ద నాని కారుపై దాడి చేశారే తప్ప, ఆయనపై దాడి చేయలేదు. కానీ దాడిని నేను కూడా ఖండిస్తున్నాను. దాడి తరవాత కూడా నాని చాలా హుషారుగా ఉన్నారు. కానీ చేతులకు, కాళ్ళకు గాయాలు అని డ్రామాలు ఆడారు. నాని భార్య సైతం ఇదే తరహాలో లేని గాయాలు సృష్టించి డ్రామాలు ఆడుతున్నారు. పులివర్తి నాని పై దాడి విషయంలో అనవసరంగా మమ్మల్ని దోషులు చేస్తున్నారు. నాని ఆడిన డ్రామాల వల్ల ఇప్పుడు ఎంతో మంది అధికారులు, నేతలు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి దాడులు సరికాదు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వాడిని హుందాగా వ్యవహరిస్తాను. ఈ ఐదేళ్లు నన్ను ఎంత దూషించినా నేను స్పందించలేదు. పులివర్తి నాని దంపతులను నేను ఏనాడూ విమర్శించ లేదు. ఈ ఐదేళ్లు వారిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.” అని ఆయన ఉద్ఘాటించారు. ఇప్పుడు నాని ప్రజంటేషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.