Indian Fan Says I Love Your Wife to Pat Cummins: నేడు ‘వాలెంటైన్స్ డే’. ఈ సందర్భంగా చాలా మంది తమ ప్రియమైన వారికి సోషల్ మీడియా అకౌంట్‌లో విషెష్ చెబుతున్నారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ కూడా తన సతీమణి బెకీ బోస్టన్‌కు వాలెంటైన్స్ డే విషెష్ చెప్పాడు. ‘గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్. సర్ఫింగ్ చేయడంలోనూ దిట్ట. హ్యాపీ వాలెంటైన్స్ డే బెకీ’ అని కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సతీమణిపై ప్రేమను కురిపించాడు. ఈ పోస్ట్ కాస్త వైరల్ అయింది.
ప్యాట్ కమ్మిన్స్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై కామెంట్ల వర్షం కురుస్తోంది. అయితే ఓ నెటిజన్ చేసిన కామెంట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ‘నేను భారతీయుడిని, నీ భార్యను ప్రేమిస్తున్నా’అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కమ్మిన్స్ అతడికి తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. ‘పర్లేదు.. ఈ విషయాన్ని ఆమెకు చేరవేస్తాను’అని బదులిచ్చాడు. కమ్మిన్స్ హుందాగా వ్యవహరించడంతో అతడిపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్ ఫాన్స్, నెటిజన్స్ ఈ రిప్లైను ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: Farmers Protest: మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం.. 60 మంది రైతులకు గాయాలు!
ప్యాట్ కమిన్స్, బెకీ బోస్టన్‌ది ప్రేమ వివాహం. 2013లో బెకీతో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరి మనసులు కలవడంతో డేటింగ్ చేశారు. 2020లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. 2021లో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. 2022లో కమిన్స్, బెకీ వివాహం చేసుకున్నారు. ఇక కమిన్స్ కెరీర్‌లో 2023 గొప్పగా గడిచింది. అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23, వన్డే ప్రపంచకప్ 2023 గెలిచింది. ఇక ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలో కమిన్స్ దిగనున్నాడు. గత వేలంలో రూ. 20.50 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Pat Cummins. 🤣 pic.twitter.com/kiXGpYAzgv
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 14, 2024