Jasprit Bumrah: నేను ఆడలేను.. బీసీసీఐకి చెప్పేసిన బుమ్రా!
- బాంబ్ పేల్చిన జస్ప్రీత్ బుమ్రా
- అన్ని టెస్ట్‌లు ఆడలేనని బీసీసీఐకి చెప్పేసిన బుమ్రా
- భారత జట్టును రేపు ప్రకటించనున్న బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెలలో ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించనుంది. సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. జట్టులో యువకులకు అవకాశం దక్కనుంది. భారత్-ఏ తరఫున ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న వారిలో కూడా టీమిండియాలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు. అయితే కీలక టెస్ట్ సిరీస్ ముందు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ బాంబ్ పేల్చినట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్ పర్యటనలో తాను ఐదు టెస్ట్‌లు ఆడలేనని బీసీసీఐకి జస్ప్రీత్ బుమ్రా సమాచారం ఇచ్చాడని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం తన శరీరం మూడు టెస్ట్‌ల కంటే ఎక్కువ సహకరించిందని, ఇంగ్లండ్ పర్యటనలో అన్ని టెస్ట్‌లు తాను ఆడలేనని బీసీసీఐ సెలెక్టర్లకు చెప్పాడట. బుమ్రా పరిస్థితిని అర్ధం చేసుకున్న బీసీసీఐ.. ఆయన అభ్యర్థనకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రేపు పూర్తి క్లారిటీ రానుంది.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: Preity Zinta: పంజాబ్ కింగ్స్ జట్టులో వివాదం.. కోర్టులో ప్రీతి జింటా పిటిషన్!
జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాలో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఆసీస్ ఛేజింగ్‌లో బౌలింగ్ చేయలేదు. సుదీర్ఘ కాలం జట్టుకు దూరమైన అతడు ఐపీఎల్ 2025తో రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ 4 ఓవర్లు మాత్రమే కాబట్టి సులువుగా వేస్తున్నాడు. టెస్టులో సుదీర్ఘ స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. అందుకే బుమ్రా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలోనే బీసీసీఐ అతడికి టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో గిల్ ముందున్నాడు. రిషభ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!