Site icon NTV Telugu

Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

నటి సమంత రూత్ ప్రభు తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అన్నిటిని దాటి దర్శకుడు రాజ్ నిడమోరును పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని సాగిస్తోంది.  తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన ఎదుగుదలలో తన భర్త రాజ్ పాత్ర ఎంతటిదో వివరిస్తూ భావోద్వేగానికి లోనయింది.

Also Read : AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!

సమంత మాట్లాడుతూ ‘తన జీవితంలో జరిగిన సంఘటనల తర్వాత తాను ఒక మంచి వ్యక్తిగా అంతకంటే మంచి నటిగా మారడానికి ప్రధాన కారణం తన భర్త రాజ్ మాత్రమే. అయన వల్లే ఈ రోజు నేను ఈరోజు ఇంత ధైర్యంగా ఉన్నాను. నాలోని నటిని మెరుగుపరచడంలో కూడా ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. అలాగే సమంత తన భర్తతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ ‘తాము వృత్తిపరమైన పనులు మరియు వర్కవుట్స్ కూడా కలిసే చేస్తాము. మేము ప్రతి పనినీ కలిసే చేస్తాం. ఒక్క రోజు కూడా నేను ఆయనకు దూరంగా ఉండలేనని రాజ్ పై తనకున్న ప్రేమానురాగాలను పంచుకున్నారు. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో లభించిన తోడ్పాటును ఆమె బహిరంగంగా ప్రశంసించడం విశేషం. రాజ్‌తో తన బంధం తనను ఎంతగా ప్రభావితం చేసిందో ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సమంత హీరోయిన్ గా రాజ్ నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకురాలిగా మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది.

Exit mobile version