ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..”వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయింది. ఎవరికి ఏమి చేయని ఎలక్షన్ మేనిఫెస్టో ఎందుకు.? ప్రసన్నకుమార్ రెడ్డి నేనే ఎమ్మెల్యే చేశా. కోవూరు ఉప ఎన్నిక వచ్చినప్పుడు నేను ఇక్కడే క్యాంపు పెట్టి ఆయన ఎన్నిక కోసం కృషి చేశా. నాలుగుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాకే సవాల్ గా మారారు. సమాజాన్ని బాగు చేయాలనేది వేమిరెడ్డి లక్ష్యం. ఒక మహిళా అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టింగులు పెడుతున్నారు. ఆమె రాజకీయాల నుంచి పారిపోతారనుకున్నారు. కానీ ఆమె ధీటుగా నిలబడ్డారు. కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. ఎన్నికలలో కౌరవధ తప్పదు. ప్రజాక్షేత్రంలో గెలిచి అసెంబ్లీని గౌరవంగా మారుస్తా. గత ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ..1000 లకు ఇచ్చాం..ఇప్పుడు రూ.5 వేలకు చేరింది. నాసిరకం మద్యాన్ని సరఫరా చేయడంతో పాటు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.”
READ MORE: TS Inter Supplementary: అలర్ట్.. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రీ షెడ్యూల్డ్ తేదీలు ఖరారు..
టీడీపీ హాయంలో విద్యుత్ ఛార్జీలు పెరగలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. “సోమశిల జలాశయాన్ని ఎన్టీ రామారావు హయాంలో నిర్మితమైంది. తెలుగు గంగ ప్రాజెక్టు ను కూడా తీసుకువచ్చారు. ఆదాయం వచ్చే మార్గాలను మూసేశారు. అమర్ రాజా కర్మాగారాన్ని రాజకీయ దురుద్దేశంతో మూసివేయాలనుకున్నారు. దీంతో వారు ఇక్కడ వదిలిపెట్టి తమిళనాడు.. తెలంగాణకు వెళ్లారు. అనంతపురం జిల్లాలో కియా కంపెనీని ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైనా మనకు రాజధాని లేదు. రైతులను ఒప్పించి 35వేల ఎకరాల భూసేకరణ చేశాం. హైదరాబాద్ కు ధీటుగా రాజధాని కట్టాలని సంకల్పించాం. హైటెక్ సిటీ కట్టకముందు ఎకరా భూమి లక్ష రూపాయలు ఉండేది.. ఇప్పుడు అక్కడ రూ.100 కోట్లు ఉంది. ఇప్పుడు అమరావతి పూర్తయిఉంటే.. మూడు లక్షల కోట్ల రూపాయల మీద ఆదాయం వచ్చేది. అమరావతి.. పోలవరం పోయాయి. టీడీపీలో అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే.. అంతేకాక 20 లక్షల ఉద్యోగాలను ఐదేళ్లలో భర్తీ చేస్తాం. కుల గణనను..స్కిల్బి సెన్సస్ కూడా చేస్తాం. అవసరమైతే బుచ్చిరెడ్డిపాలెం లాంటి ప్రాంతాల్లోనే టవర్ నిర్మించి ప్రపంచ కంపెనీలలో పని చేసే అవకాశాన్ని కల్పిస్తాం.”