NTV Telugu Site icon

Rishi Sunak: క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా..

Rishi Sunak

Rishi Sunak

Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ పార్టీ 300 సీట్లకు పైగా గెలుచుకున్నట్లు ట్రెండ్‌లు చూపించగా.. సునాక్ కన్జర్వేటివ్ పార్టీ 61 స్థానాల్లో ముందంజలో ఉంది. “ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించింది. ఈ సందర్భంగా కీర్‌ స్టామర్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. దేశంలో అధికారం శాంతియుతంగా, సద్భావనతో చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు , స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందని రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలెర్టన్‌లోని తన మద్దతుదారులను ఉద్దేశించి రిషి సునాక్ అన్నారు. క్షమించండి.. ఓటమికి తాను బాధ్యత వహిస్తానని రిషి సునాక్ పేర్కొన్నారు.

Read Also: Asteroid: భూమికి పొంచి ఉన్న మరో ప్రమాదం.. అదే జరిగితే మానవ జాతి అంతం..!

ఎనిమిది మంది కన్జర్వేటివ్ కేబినెట్ మంత్రులు తమ స్థానాలను కోల్పోయినప్పటికీ, సునాక్ ఉత్తర ఇంగ్లాండ్‌లోని రిచ్‌మండ్ అండ్‌ నార్తర్న్ అలెర్టన్‌ నియోజకవర్గాల్లో 47.5 శాతం ఓట్లను సాధించారు. రిషి సునక్ తన ముందున్న లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల్లో పదవికి రాజీనామా చేసిన తర్వాత 2022లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 14 సంవత్సరాలు పాలించిన తరువాత, కన్జర్వేటివ్ పార్టీ అనేక సమస్యలపై ఎదురుగాలిని ఎదుర్కొంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించిన అనంతరం ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం గందరగోళంగా మారింది. కొవిడ్ -19 మహమ్మారి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ప్రభుత్వం తప్పుగా నిర్వహించడం వల్ల ఓటర్లు కూడా విసుగు చెందారని అభిప్రాయ సేకరణలు వెల్లడించాయి.