Hyundai Motor India IPO: భారతదేశపు అతిపెద్ద ఐపిఓ రూ.27,870 కోట్ల ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ స్టాక్ మార్కెట్‌లో నిరుత్సాహకర లిస్టింగ్‌తో మొదలైంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ లిస్టింగ్ ఈ రోజు (అక్టోబర్ 22) న దేశీయ మార్కెట్లో నష్టాలతో మొదలైంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలో నష్టాలలో ప్రారంభమయ్యాయి. హ్యుందాయ్ మోటార్ షేర్ ధర అంచనా కంటే తక్కువతో లిస్టింగ్ అయ్యింది. ప్రారంభమైన తర్వాత కూడా స్టాక్ దాదాపు 3% కంటే ఎక్కువ పడిపోయింది. ఈ ఐపిఓకు 2.37 శాతం సబ్‌స్క్రైబ్ చేయబడింది.
Read Also: Gold Rate Today: పెరుగుదలకు నో బ్రేక్.. 80 వేలకు చేరువైన బంగారం!
దక్షిణ కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ భారతీయ ఆర్మ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ స్టాక్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ఈ రోజు ఉదయం 10 గంటలకు హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు ఒక్కో షేరుకు రూ. 1,931 గా లిస్ట్ అయ్యింది. దాని ఇష్యూ ధర నుండి 1.5% తగ్గింపుతో జాబితా చేయబడ్డాయి. ఈ షేరు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ.1,931 స్థాయిలో లిస్ట్ కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఒక్కో షేరు ధర రూ.1,934గా నమోదైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆటో రంగంలో ఐపీఓ వచ్చింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ యొక్క ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.1,934.
Read Also: Kalyani Priyadarshani : సీరియల్ నటుడితో పెళ్లి.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన భామ..?
27,870.16 కోట్ల ఈ ఐపీఓ ఇప్పటి వరకు భారతదేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ. హ్యుందాయ్ ఐపీఓ అక్టోబరు 15న బిడ్డింగ్ కోసం తెరవబడింది. ఈ బిడ్లు అక్టోబర్ 17న ముగిశాయి. ఇష్యూ తెరవడానికి చాలా రోజుల ముందు, గ్రే మార్కెట్ ధర (GMP) రూ. 570కి చేరుకుంది. దీని తర్వాత, సబ్‌స్క్రిప్షన్ కోసం ఇష్యూ తెరిచిన రోజున GMP రూ.63కి పడిపోయింది. ఇష్యూ ముగింపు రోజున GMP క్యాప్ ధర కంటే రూ. 32 తగ్గింది. దీని తర్వాత మళ్లీ జీఎంపీ పెరిగి రూ.95కి చేరింది.