NTV Telugu Site icon

Hyundai Inster EV: హ్యుందాయ్ నుంచి మరో ఎలక్ట్రిక్ కార్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..!

Hundai

Hundai

హ్యుందాయ్ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు రాబోతుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ ఇన్‌స్టర్‌ను దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు హ్యుందాయ్ ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. కంపెనీకి చెందిన ఈ కారుని ఏ విభాగంలో తీసుకొచ్చారు.? ఇందులో ఎలాంటి ఫీచర్లను అందిస్తున్నారు.? ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు నడపగలదు.? భారత్‌కు ఎప్పుడు తీసుకురావచ్చు.? ఇప్పుడు తెలుసుకుందాం. హ్యుందాయ్ మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా కొత్త ఎలక్ట్రిక్ కార్ ఇన్‌స్టర్‌ను పరిచయం చేసింది. ఈ కారు బుసాన్ ఇంటర్నేషనల్ మొబిలిటీ షో 2024లో A సెగ్మెంట్ సబ్-కాంపాక్ట్ SUVగా పరిచయం చేయబడింది.

Read Also: Maharashtra: మహారాష్ట్ర ఇండీ కూటమి సీఎం అభ్యర్థి ఎవరు..? ఠాక్రే సమాధానం..

ఫీచర్లు..
కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. కాంపాక్ట్ EVలో చాలా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఎల్‌ఈడీ లైట్లు, ప్రొజెక్షన్ హెడ్‌ల్యాంప్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 50-50 స్ప్లిట్ సీట్లు, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, త్రీ స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, పుష్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. బటన్ స్టార్ట్/స్టాప్, యాంబియంట్ లైట్లు, సన్‌రూఫ్, ADAS మరియు NFC ఇందులో ఉన్నాయి.

Read Also: LK Advani: ఎయిమ్స్‌లో ఎల్‌కే.అద్వానీకి టెస్టులు పూర్తి.. డిశ్చార్జ్

బ్యాటరీ-మోటార్..
ఈ ఎలక్ట్రిక్ కారును కంపెనీ 42 kWh, 49 kWh బ్యాటరీని ఉంచారు. ఈ వాహనం ఒక్కసారి చార్జ్ చేస్తే 355 కి.మీల రేంజ్‌ని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 120 kW DC ఛార్జర్‌తో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 30 నిమిషాలు పడుతుంది. ఈ కారులో ఒకే మోటారు ఉంటుంది. ఇది 97 PS, 115 PS శక్తిని.. 147 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఇస్తుంది.