Site icon NTV Telugu

Hyundai i20 Magna Executive: హ్యుందాయ్ ఐ20 కొత్త వేరియంట్ విడుదల.. ధర ఎంతంటే?

Hundai

Hundai

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కార్ లవర్స్ కోసం కొత్త వేరియంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో అందించే హ్యుందాయ్ i20 కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌ను మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్ పేరుతో అందిస్తోంది. హ్యుందాయ్ i20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది ఆరు ఎయిర్‌బ్యాగులు, ESC, VSM, హిల్ హోల్డ్ కంట్రోల్, 15-అంగుళాల వీల్స్, TPMS, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో MIDతో ప్రామాణికంగా వస్తుంది. దీనితో పాటు, మాగ్నా వేరియంట్‌లో iVT తో సన్‌రూఫ్ కూడా అందించారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, ఈ వేరియంట్‌లో వెనుక AC వెంట్, LED DRL, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ కన్సోల్, స్టోరేజ్ కూడా ఉన్నాయి.

Also Read:Indian Envoy: ఆపరేషన్ సింధూర్ ముగియలేదు.. ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందే!

హ్యుందాయ్ i20 మాగ్నా వేరియంట్ కాకుండా, స్పోర్ట్స్ (O) వేరియంట్‌లో కూడా ఫీచర్లు అప్ డేట్ చేశారు. ఈ వేరియంట్ ఇప్పుడు బోస్ సెవెన్ స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో స్మార్ట్ కీ, యు పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, FATCతో డిజిటల్ డిస్‌ప్లే, Z ఆకారపు LED టెయిల్ లాంప్‌తో వస్తుంది.

Also Read:Terror Bid Foiled: భారీ పేలుళ్ల కుట్ర భగ్నం.. సిరాజ్‌ నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులు

ధర ఎంత?

హ్యుందాయ్ i20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ను రూ. 7.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. టాప్-స్పెక్ మాగ్నా iVT వేరియంట్ రూ. 8.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ (O) వేరియంట్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.05 లక్షల నుంచి రూ. 9.99 లక్షల మధ్య ఉంది.

Exit mobile version