Hyundai Founder Story: జీవితంలో ఎప్పుడు, ఎవరు, ఎలా మారుతారో తెలియడం చాలా కష్టం. కనీసం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే.. ఓ వ్యక్తికి కనీసం తినడానికి తిండి కూడా లేని స్థాయి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థను నిర్మిస్తారని కలలో కూడా ఊహించలేం. కానీ జనాల ఊహాను తలక్రిందులు చేస్తూ.. తన కలను నిజం చేసుకున్నాడు ఓ అసామాన్యుడు. ఇంతకీ ఆయన ఎవరూ, ఆయన స్థాపించిన సంస్థ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Little Hearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ..?
పరిచయం అవసరం లేని సంస్థ..
అది దక్షిణ కొరియా ఆటో కంపెనీ హ్యుందాయ్. దీనికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నేడు ఈ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ సామ్రాజ్యాలలో ఒకటిగా వెలుగొందుతుంది. ఈ బ్రాండ్ కార్లు లక్షలాది మంది మనసును చురగొన్నాయి. కానీ ఈ సంస్థ ఆవిర్భావం వెనుక పోరాటం, కృషి, పట్టుదల ఎంత మందికి తెలుసు. సంస్థ ఎదుగుదలలో ఎంత కష్టతరమైన పరిస్థితులు ఎదురైనా, ధైర్యంగా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగిపోయిన అసలైన వ్యక్తి గురించి ఎంత మందికి తెలుసు. కలలు కనడం కాదు.. వాటిని సాధించుకోవాలని నిరూపించిన ఆ వ్యక్తి పేరే.. చుంగ్ జు-యుంగ్.
హ్యుందాయ్ వ్యవస్థాపకుడు తెలుసా?
హ్యుందాయ్ సంస్థ వ్యవస్థాపకుడు చుంగ్ జు-యుంగ్. ఇప్పుడంటే ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ సామ్రాజ్యంలో అగ్రగామిగా వెలుగొందుతుంది కానీ.. సంస్థ స్థాపించిన వ్యక్తి ఒక నాడు ఆహారం కూడా కొనలేని స్థితిలో బతుకును సాగించాడు. నిరాశతో ఆయన ఆకలిని తీర్చుకోడానికి చెట్టు బెరడు తిన్నాడని ఎంత మందికి తెలుసు. తన చుట్టూ ఉన్న పరిస్థితులను తలుచుకుంటూ ఆయన అక్కడే ఆగిపోతే ఈ రోజు ఆయన పేరు చరిత్ర పుట్టాల్లో సువర్ణ అక్షరాలతో లిఖించబడేది కాదు. ఆయన పరిస్థితులకు తలవంచితే ప్రపంచ ప్రఖ్యాత కార్ బ్రాండ్ హ్యుందాయ్‌ను నిర్మించే వాడు కాదు.
1915 నవంబర్ 25న పేద కొరియా వ్యవసాయ కుటుంబంలో చుంగ్ జు-యుంగ్ జన్మించారు. ఆయన జీవితం ఒక పోరాటం. ఆయన తన జీవితంలో ప్రతి క్షణం పోరాటంతో జీవించాడు. ఆయన కనీసం తిండి కూడా సరిగ్గా దొరకని పరిస్థితుల నుంచి, కాళ్లకు చెప్పులు లేకుండా బతికిన రోజుల నుంచి తన కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చాడు. కానీ ఆయన ఎన్నడూ పేదరికాన్ని తన ఆలోచనను అదుపు చేసే పరిస్థితి మాత్రం కల్పించకూదని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఉన్న చోటనే ఆగిపోకూదని కంకణం కట్టుకొని పేదరికంపై తిరుగుబాటును చేశాడు.
ఇక్కడే హ్యుందాయ్‌కి పునాది.
వాస్తవానికి చుంగ్ జు-యుంగ్ తన జీవితంలో చదువుకోడానికి అనేక కష్టాలు పడ్డారు. ఆయన వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చడం కోసం చిన్న వయసు నుంచే కష్టపడి పనిచేయడం, చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం ప్రారంభించాడు. ఏది ఏమైనా ఆయన తన కలలను మాత్రం విడిచిపెట్టలేదు. ఎప్పుడూ ఆయన పెద్ద కలలు కంటూనే ఉండేది. ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. కేవలం ఆయన కలలు కనడం వరకే పరిమితం కాలేదు. వాటిని నిజం చేసుకోడానికి అడుగులు సైతం వేయడం ఆరంభించాడు. ఇది కావాల్సింది. ఎందుకంటే కొందరు కేవలం కలలు కనడం వరకే పరిమితం అయ్యి… జీవితంలో ఏది సాధించలేక దేవుడిని, పరిస్థితులను నిందిస్తూ బతికినంత కాలం చస్తూ బతుకుతారు. కానీ ఆయన వాళ్లలా కాకుండా కలలను నిజం చేసుకోడానికి 1947లో ఒక చిన్న నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.
ఆదిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా వాటికి ఎదురు నిలిచి, ప్రారంభ పోరాటాల ఆటుపోటులను, వనరుల కొరతను సమర్థంగా దాటుకొని నిలబడ్డాడు. ఏదిఏమైనా చుంగ్ జు-యుంగ్ తన కలను వదులుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. ఈ మొండి తెగింపే ఆయనను విజయతీరాలకు చేర్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి తర్వాత కాలంలో ఆయన జపాన్, యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లాడు. ఆయన నేర్చుకున్న విషయాలతో తన కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాడు. 1967లో ఆయన హ్యుందాయ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని, 1976లో హ్యుందాయ్ మోటార్స్‌ను స్థాపించాడు. క్రమంగా కంపెనీ దక్షిణ కొరియా సరిహద్దులను దాటి ప్రపంచంలోని ప్రముఖ కార్ కంపెనీలలో ఒకటిగా మారింది. కష్టపడే తత్వం, ఓటములను చూసి పారిపోకుండా మొండి ధైర్యంతో, కృషిని నమ్ముకొని, దార్శనికతతో ఉంటే ఎవరైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని చుంగ్ జు-యుంగ్ తన జీవితంలో నిరూపించారు. ఆయన 2001లో మరణించారు, కానీ ఆయన జీవితం, ఆయన విజయాలు నేటికీ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.
READ ALSO: Condom Sales Iran Crisis: ఇదేంది ఇది! క్రైసిస్ టైంలో రికార్డ్ బ్రేకింగ్ కండోమ్స్ సేల్.. ఎక్కడంటే?
