Hyundai Exter: హ్యుందాయ్ నుంచి SUV కారు..రూ. 10 లక్షలే.. ఫీచర్స్ అదిరిపోయాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Exter: భారతీయ కార్ మార్కెట్లో ఎస్యూవీ కార్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది.. ఈ దృష్ట్యా, హ్యుందాయ్ తన కొత్త SUV ఎక్స్టర్ను త్వరలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఈ కారు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇది కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో టాటా, పంచ్, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మారుతి సుజుకి, స్విఫ్ట్‌తో పోటీ పడుతుంది.
Read Also: Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ, విజిలెన్స్ సోదాలు.. నేడు వీసీ ని విచారించే చాన్స్
Also Read
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
- India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్‌తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
- UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
- India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
హ్యుందాయ్ ఎక్స్టర్లో కంపెనీ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్ లోకి వస్తుంది. ఈ కారులో విశేషమేమిటంటే ఇందులో సీఎన్ జీ వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ కారు దాదాపు 82 బీహెచ్పీ పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ పొందవచ్చు.. ఈ కారులో డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్ అందుబాటులో ఉండనున్నాయి. కాంట్రాస్ట్ బ్లాక్ గ్రిల్ , ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ కారుని మిగతా వాటి నుంచి దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
Read Also: Mahesh Babu: ఆల్ టైం రికార్డ్.. ‘గుంటూరు కారం’దే టాప్ ప్లేస్!
కారు పొడవు దాదాపు 3.8 మీటర్లుగా ఉంది. కేవలం 10 లక్షల లోపే ఈ కారును విడుదల చేస్తున్నారు అని టాక్. ఇది కంపెనీ వెన్యూ, క్రెటా మధ్య గ్యాప్ ను తగ్గిస్తుంది. ఈ కారు ఐదు విడతలలో విడుదల చేయనున్నారు. ఇది 5 సీట్ల స్టైలిష్ కారు.. కారు బాక్సీ లుక్‌లో అదిరిపోయింది. హెచ్-ప్యాటర్న్ LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లను కలిగి ఉంది. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెట్‌తో మార్కెట్ లోకి వస్తుంది.
Read Also: Top Headlines @9AM : టాప్ న్యూస్
అయితే ఈ కారులో సన్ రూఫ్ ఫీచర్ ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. హ్యుందాయ్ Xeter దీనికి ప్రత్యేకంగా జత చేశారు. ఇది వాయిస్ కమాండ్ కూడా తీసుకోగలదు.. దీనిని స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అని పిలవవచ్చు.. ఈ సన్‌రూఫ్‌ను తెరిచేందుకు.. ‘ఓపెన్ సన్‌రూఫ్’ వంటి వాయిస్ కమాండ్ ఇవ్వడంతో అది తెరుచుకుంటుంది. అలాగే ఈ మైక్రో ఎస్‌యూవీలో హ్యుందాయ్ అందించిన మరో ప్రత్యేక ఫీచర్ డాష్‌క్యామ్.. దాని డాష్‌బోర్డ్‌లో డ్యూయల్ కెమెరా ఇన్స్టాల్ చేయబడింది. ఇందులో ముందు, వెనుక కెమెరాలు ఉన్నాయి. ఇది కాకుండా, అనేక రికార్డింగ్ మోడ్లు 2.31 అంగుళాల LCD డిస్ప్లే, స్మార్ట్‌ఫోన్ యాప్ కనెక్టివిటీని కూడా అటాచ్ చేశారు.
Read Also: Ajay Devgn: ఒక్క సినిమా ఎనిమిది సార్లు వాయిదా…
హ్యుందాయ్ Xter మైక్రో SUV 1.2L పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. ఇది ఆటోమేటిక్- మాన్యువల్ గేర్‌బాక్స్‌లను ఇందులో ఏర్పాటు చేశారు. ఇది కాకుండా, ఈ SUV లో CNG ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. హ్యుందాయ్ ఈ కారును జూలై 10న విడుదల చేయబోతోంది. కంపెనీ తన కారును ఐదు వేరియంట్లలో ప్రదర్శించనుంది.
తాజావార్తలు
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్‌తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!