హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో అమ్మడు బిజీగా ఉంది.. ఈ క్రమంలో బుల్లితెర డ్యాన్స్ షో ఢీ లో సందడి చేసింది.. మంగళవారం టీమ్ పాయల్ రాజ్ పుత్, డైరక్టర్ అజయ్ భూపతి గెస్ట్ లుగా వచ్చారు. ఇక వీళ్లతో హైపర్ ఆది చేసిన హడావుడి మాములుగా లేదు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ప్రోమో స్టార్టింగ్ లో హైపర్ ఆది పంచె కట్టుకొని అక్కినేని నాగేశ్వరరావు ను ఇమిటేట్ చేసాడు.. ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఆది ఎవరైనా వస్తే ఎలా చేస్తాడో తెలిసిందే. ఏ హీరోయిన్ వచ్చినా ఆవిడని పైకి ఎత్తి అంటూ తన దైన శైలిలో బోల్డ్ డైలాగ్ లతో రెచ్చి పోయాడు. ఇక తర్వాత అక్కడే కూర్చున్న హీరోయిన్ పాయల్ దగ్గరకు వెళ్లి సాల్సా డాన్స్ చేద్దామా అని ఆమెతో రెండు స్టెప్ లు వేసాడు. ఆది డ్యాన్స్ చూసి పాయల్ బెదిరిపోతుంది. ఇంతలో హడావుడిగా పాయల్ ను ఎత్తుకొని డ్యాన్స్ చేస్తాడు ఆది. ఏంట్రా మాకు ఈ దరిద్రం అని అజయ్ భూపతి ఓ లుక్ ఇచ్చాడు. ఇక తర్వాత సెమీఫైనల్స్ అన్ని టీమ్స్ బాగా డ్యాన్స్ చేశాయి..
ఈ ప్రోమోలో ఓ కంటెస్టెంట్ తన కష్టాలను చెప్పి ఏడ్చేసాడు.. ఎవరి సపోర్ట్ లేకుండా ఇక్కడివరకు వచ్చిన తన ప్రయాణం గురించి జనాలకు తెలిసేలా చేశాడు..షూట్ అయిపోయిన మార్నింగే వెళ్లి మనీ కోసం మళ్లీ వర్క్ చేసాను. వాళ్లకి ఇంకా మంచి కొడుకు ఉంటే బావుండు, నేను వేస్ట్, మా నాన్నకి ఉన్న అప్పులన్నీ తీర్చేసి రెండు పూటలా భోజం పెట్టాలనేదే నా కల సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఓ కంటెస్టెంట్. ఈ మాటలు విని జడ్జీలు శేఖర్ మాస్టర్, పూర్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు.. ప్రదీప్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.. మరి రేపు ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది.. మిస్ అవ్వకుండా చూడండి..