Site icon NTV Telugu

HYDRA Police Station : హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

HYDRA Police Station : హైదరాబాద్ నగరంలో భారీ స్పందన పొందిన హైడ్రా (HYDRAA) ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రత్యేక విభాగానికి ఇటీవల ప్రభుత్వం మరిన్ని అధికారాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించినట్లుగా, త్వరలో ప్రత్యేక హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా, మే 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.

World Tuna Day : టూనా దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఏమిటి..? ఈ రోజు చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసా..?

ఇకపై చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములపై జరిగే అక్రమ ఆక్రమణలపై స్థానికులు లేదా అధికారులు ఫిర్యాదు చేస్తే, హైడ్రా పోలీస్ స్టేషన్లలోనే కేసులు నమోదు అవుతాయి. ఇప్పటివరకు సాధారణ పోలీస్ స్టేషన్లలో నమోదైన భూకబ్జా కేసులపై హైడ్రా దాడులు జరుపుతూ వస్తోంది. అయితే త్వరలోనే ఈ కేసులు సాధారణ స్టేషన్ల నుంచి హైడ్రా స్టేషన్లకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

Kolkata: మూగజీవంపై అమానుషం.. గుర్రం యజమానిపై కేసు

Exit mobile version