బుద్ధ భవన్ ప్రక్కన హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. బుద్ధ భవన్ పక్కనే వున్న భవనంలో హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. హైడ్రా పోలీసు స్టేషన్‌కు ఉద్దేశించిన భవనాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. అనంతరం.. హైడ్రా పోలీసు స్టేషన్లో కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష చేపట్టారు. పోలీసు స్టేషన్ తరహాలోనే లోపల గదులు, కేబిన్ల నిర్మాణాలు ఉండాలని కమిషనర్ సూచించారు. స్టేషన్ అధికారుల క్యాబిన్లతో పాటు ఫిర్యాదుదారులకు కల్పించాల్సిన వసతులపై సమీక్ష నిర్వహించారు. హైడ్రా పోలీసు స్టేషన్ సైన్ బోర్డులు ప్రముఖంగా కనిపించేలా చూడాలని కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు ఇచ్చారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల వాహనాల పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూడాలని సూచనలు ఇచ్చారు.
Read Also: AAP vs BJP: ‘‘రావణుడు బంగారు జింకగా వచ్చాడా..?’’ కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శలు..
హైడ్రాకు విస్తృతమైన అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నగరంలోని జలాశయాలు, చెరువులు, మరియు ఇతర ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. అయితే, ఈ సంస్థ ఏర్పాటుకు సంబంధించి చట్టపరమైన అధికారం గురించి వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను మరింత స్పష్టంగా రూపొందించింది. హైడ్రా దాని ప్రత్యేక అధికారాలతో నగరంలో అవినీతి, అక్రమ కబ్జాలు, మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నగరంలోని విలువైన ఆస్తులను పరిరక్షించడంలో ఈ ఏజెన్సీ మరింత శ్రద్ధ వహించనుంది.
Read Also: Venkatesh : 25ఏళ్ల నాటి సంక్రాంతి సీన్ రిపీట్.. ఈ సారి కూడా విక్టరీ ఆ హీరోదే