NTV Telugu Site icon

HYDRA : ఔటర్ బయట ఉన్న రూరల్ ప్రాంతంలోని చెరువులు, నాలాలపై హైడ్రా ఫోకస్‌

Hydra

Hydra

హైడ్రా ఇప్పటివరకు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, నాలాల పైన దృష్టి పెట్టింది. మొదటి సారి రంగారెడ్డి జిల్లా ఔటర్ బయట ఉన్న రూరల్ ప్రాంతంలోని చెరువులు, నాలాలను హైడ్రా బృందం పరిశీలించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని మసాబ్ చెరువు, పెద్ద చెరువుల పరిధిలోని నాలాలను హైడ్రా సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటించింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పరిధిలోని ఉప్పరిగూడ, పోచారం గ్రామాల్లోని బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ను హైడ్ర అసిస్టెంట్ కమిషనర్ పాపయ్య బృందం పరిశీలించింది. అబ్దుల్లాపూర్ మెట్టు మాసాబ్ చెరువు, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా బృందం పరిశీలించింది.

Kashi: తిరుపతి లడ్డు తిన్నందుకు.. సనాతన పద్ధతిలో శుద్ధి.. ప్రక్రియ ఇదే!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలిస్తున్న హైడ్రా బృందం ఎఫ్టీఎల్ లోపల ఇల్లు నిర్మాణలు, రాచకాలవ ,ఫిరంగి కాలువలను కబ్జాకు గురైన ప్రదేశాలను పరిశీలిస్తున్న ఇరిగేషన్, పోలీస్ శాఖ ,రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది. ఇదిలా ఉంటే.. హైడ్రా అధికారులు, పోలీసులు సోమవారం ఉదయం కావూరి హిల్స్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో కావూరిహిల్స్‌లోని పార్కును ఆక్రమించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. పార్క్ స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణంపై కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమంగా నిర్మించిన షెడ్లను కూల్చివేశారు. ఈ అక్రమ కట్టడాలను తొలగించి కావేరి హిల్స్ పార్క్ పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు.

Laapataa Ladies: ఆస్కార్ రేసులో సూపర్ హిట్ మూవీ.. కథ అదిరిపోయింది.. చూశారా?