Site icon NTV Telugu

HYDRA: ఉలిక్కపడ్డ పాతబస్తీ.. చంద్రయాణగుట్ట హైడ్రా కూల్చివేతలు

Hydra

Hydra

HYDRA: హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రయాణగుట్ట నియోజకవర్గం, బండ్లగూడ మండలం పరిధిలో హైడ్రా విభాగం అక్రమ కబ్జాదారులపై విరుచుకుపడింది. అక్బర్ నగర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 303 నుంచి 306 వరకూ ఉన్న ప్రభుత్వ భూమిలో 2000 గజాల మేర కబ్జా చేసిన స్థలాన్ని గుర్తించిన హైడ్రా బృందం, అక్కడ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసింది. ఇటీవల కాలంగా చెరువులు, ప్రభుత్వ భూములపై జరిగుతున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా తీవ్రంగా ఫోకస్ చేస్తోంది. ఈ చర్యలతో కబ్జా రాయుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ కూల్చివేతలకు వ్యతిరేకంగా పలువురు MIM కార్పొరేటర్లు, మహిళా నాయకులు హైడ్రా అధికారులపై నిరసన చేపట్టారు.

‘Tourist Family’ : నాని హిట్ 3, సూర్య ‘రెట్రో’ ని వెనక్కి నెట్టిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’..

“హైడ్రా రంగరాజన్ డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు. కొందరు హైడ్రా కమిషనర్ పై డబ్బులు తీసుకోకుండా కూల్చివేశారని ఆరోపించారు. ఈ క్రమంలో నిరసన వ్యక్తం చేసిన పలువురు MIM నేతలు, మహిళా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైడ్రా దాడుల సమయంలో అక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఇందులో భాగంగా, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు లేదా చెరువుల్లో చేపట్టిన నిర్మాణాలపై ఎవరైనా సమాచారమిస్తే, వాటిపై వెంటనే చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారుల వర్గాలు స్పష్టం చేశాయి.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version