Site icon NTV Telugu

Viral Video: కేవలం రూ. 500కే ఐదు బ్లౌజులు.. దుకాణం ముందు బారులు తీరిన మహిళలు!

Viral

Viral

Viral Video: భారతీయులలో ముఖ్యంగా మధ్య తరగతి వినియోగదారులకు ఆఫర్, డిస్కౌంట్, ఫ్రీ వంటి మాటలు వినిపిస్తే చాలు.. అది ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్లిపోతుంటారు ప్రజలు. నిజానికి కొందరైతే ఆ వస్తువు అవసరం ఉన్నా లేకున్నా ఆఫర్ అంటే ఓ మోజు. ఈ మధ్య కాలంలో చిన్నా, పెద్ద కంపెనీలు అలాగే వ్యాపారస్తులు తమ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టి మార్కెట్‌ని ఆకట్టుకుంటున్నారు. ఇది వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుంది. ఇకపోతే, తాజాగా హైదరాబాద్‌ దిల్ షుక్ నగర్‌లో తాజాగా జరిగిన ఓ ఘటన దీన్ని మరింత స్పష్టంగా నిరూపించింది.

Read Also: India Pakistan Tension: పాకిస్తాన్ వ్యవసాయం కుదేలు.. భారత్‌ నిర్ణయంతో వణుకుతున్న దాయాది..

హైదరాబాద్‌ నగరంలోని దిల్ షుక్ నగర్‌లోని రాజీవ్ చౌక్ వద్ద కొత్తగా ఓపెన్ అయిన “బ్లౌజ్ వరల్డ్” షాపు ఓపెనింగ్ రోజున ఓ భారీ ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ ఏంటంటే.. కేవలం రూ. 500కే 5 బ్లౌజులు. ఇంకేముంది.. అలా ఆఫర్ ప్రకటించారో లేదో.. ఈ ఆఫర్ చూసిన మహిళలు ఎగబడ్డారు. బ్లౌజ్ ధరలు సాధారణంగా ఒక్కోటి రూ.200 పైగా పడుతుండగా, అలాంటింది ఐదు బ్లౌజులను కేవలం రూ.500కే అనగానే మహిళలు షాప్ ముందు వాలిపోయారు. ఇక ఈ ఆఫర్ ను దక్కించుకోవడానికి షాపు బయట కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసారు.

Read Also: Moto g56 5G: 6.72 అంగుళాల డిస్‌ప్లే, 5200mAh బ్యాటరీ, IP69 సర్టిఫికేషన్లతో రాబోతున్న మోటో g56..!

ఇక ఈ ఆఫర్ సంబంధించిన బ్లౌజ్ షాపు యజమాని మాట్లాడుతూ.. తమ ఉద్దేశ్యం ఓపెనింగ్ రోజున మంచి పబ్లిసిటీ చేసుకోవాలని మాత్రమే.. కానీ, ఇంత భారీ స్పందన వస్తుందని ఊహించలేదని తెలిపారు. వ్యాపారం ఊహించిన దానికన్నా ఎక్కువ జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఆఫర్ సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version