Telangana Formation Day Celebrations : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ఉత్సవాలు, అలాగే బీఆర్‌ఎస్ మూడు రోజులపాటు నిర్వహించే వేడుకలు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సందర్భంగా, హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్, గన్ పార్క్, పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతాయి. ట్యాంక్ బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్ పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి. వాహనదారులు ఈ సమయంలో వాహనదారులు ప్రత్యేక మార్గాలలో ప్రయాణించాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..


