NTV Telugu Site icon

Hyd -Vijayawada Highway : హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఇవే..!

Block Spots

Block Spots

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి (65) పై బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (హైదరాబాద్ – విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే) విజయవాడ, హైదరాబాదు లను కలిపే 181 కిలోమీటర్ల నాలుగు నుంచి ఆరు వరుసల జాతీయ రహదారి. ఇది మచిలీపట్నంను పూణేతో కలిపే జాతీయ రహదారి 65 లో ఒక భాగం. దీనిని రెండు వరుసలనుండి విస్తరణ పని పూర్తి చేసి అక్టోబర్ 2012 లో ప్రారంభించారు. జిఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థ “జిఎంఆర్ విజయవాడ-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్” ద్వారా బిల్డ్-ఓన్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (BOOT) ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. 2007 ప్రారంభంలో, భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ అప్పటి రెండు వరుసల విజయవాడ-హైదరాబాద్ సెక్షను నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ 2007 లో మంజూరు చేయబడింది.

రహదారి పనికి ఎంపికైన జి.ఎం.ఆర్ గ్రూప్ 11 జూన్ 2009 న జి.ఎం.ఆర్ హైదరాబాద్ విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్‌ స్పాట్స్‌లను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆ బ్లాక్‌ స్పాట్స్‌ మరమ్మతులపై నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఎదరుచూస్తున్న హైదరబాద్- విజయవాడ హైవే మరమ్మతులకు మోక్షం కలుగనుంది. రహదారి పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. చాలాకాలంగా బ్లాక్‌ స్పాట్స్‌ మరమ్మతుల పనులు పెండింగ్‌ ఉండటంతో… 17 ప్రాంతాల్లో పనులకు రూ.326 కోట్ల వ్యయం అవుతుందని అధికారుల అంచనా వేశారు. సైన్‌ బోర్డ్స్‌, హెవీ స్పీడ్‌ కంట్రోల్‌, వెహికిల్‌ అండర్‌ పాస్‌ల నిర్మాణంపై చర్యలు తీసుకోనున్నారు.

బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలు

1. చౌటుప్పల్ (52840-5530)
2. పెదకాపర్లి
3. చిట్యాల
4. కట్టంగూర్
5. ఇనుపాముల
6. టెక్మట్ల
7. ఎస్.వీ.కాలేజ్ జనగాం ఎక్స్ రోడ్
8. ఈనాడు జంక్షన్
9. దురాజ్ పల్లి జంక్షన్
10. ముకుందాపూరం
11. అకుపాముల
12. కోమరబండా ఎక్స్ రోడ్డ్
13. కాటకమ్మగూడెం
14. మేళ్లచెరువు
15. శ్రీరంగాపురం
16. రామాపురం ఎక్స్ రోడ్డు
17. నవాబ్ పేట్ జంక్షన్

ఈ ప్రాంతాల్లో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు రహదారుల శాఖ గుర్తించింది. ముఖ్యంగా సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్నిచోట్ల ఆరు లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం, జంక్షన్ డెవలప్ మెంట్స్, VUP (వెహికిల్ అండర్ పాస్) ల నిర్మాణం, రెండు వైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

 

Show comments