NTV Telugu Site icon

Hyderabad: అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవం.. ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం..

Hyd

Hyd

నాటక రంగంలో బాల బాలికల ప్రతిభను పెంపొందించేందుకు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రముఖ నటనా శిక్షణ సంస్థ “నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా” హైదరాబాద్‌‌లో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవాన్ని నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో కోల్కతా, భోపాల్, కేరళ ప్రాంతాల నుంచే కాకుండా.. నేపాల్, జపాన్ తదితర దేశాల్లోని కళాకారులు, నాటక బృందాలు సైతం పాల్గొననున్నాయి. రవీంద్రభారతి ఆడిటోరియంలో ఏప్రిల్ 7 నుంచి 9 వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో.. థియేటర్, స్టోరీ టెల్లింగ్, నాటక ప్రదర్శనలతో చిన్నారులను అలరించే ఓ అద్భుతమైన వేదికను అందించేందుకు నిర్వాహకులు సంసిద్ధమయ్యారు.

Read Also: Tamim Iqbal: ఆసుపత్రి నుంచి తమీమ్ ఇక్బాల్ డిశ్చార్జ్..

కొత్తతరం కళాకారుల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలను పెంపొందించే ఈ వేదికపై వీక్షకులను మంత్రముగ్ధులను చేసే నాటకాలు ప్రదర్శితం కానున్నాయి. నాటక ప్రదర్శన కళలను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా ఈ ఈవెంట్‌ ను మరింత విజయవంతం చేసేందుకు తనవంతు కృషి చేస్తోంది. ‘స్వీయ వ్యక్తీకరణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, కళలపై పట్టు సాధించడానికి నాటక రంగం ఓ శక్తివంతమైన సాధనం. విభిన్న సంస్కృతుల నుంచి యువ కళాకారులను ఓ చోట చేర్చడం ద్వారా కొత్తతరం నాటక ప్రేమికులను ప్రోత్సహించాలని భావిస్తున్నాం.’ అని నిర్వాహక బృందం ప్రతినిధి దేవికాదాస్ పేర్కొన్నారు.

Read Also: Wife Poisons Husband: భర్తకు కాఫీలో విషం పెట్టిన భార్య.. వేరే వ్యక్తితో మాట్లాడొద్దనడమే పాపమా..?

అంతర్జాతీయ స్థాయిలో రంగస్థలంపై చిన్నారులు చేసే మ్యాజికల్ పర్ఫామెన్స్ వీక్షించడానికి ఓ అద్భుతమైన అవకాశాన్ని ఈ ఈవెంట్ అందిస్తోంది. కళ్లు చెదిరే నాటక ప్రదర్శనలు, అలరించే కార్యక్రమాల సమ్మేళనంతో మొదటి అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవం.. ఓ ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమంగా నిలువబోతోంది.