NTV Telugu Site icon

NIA Court: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో తీర్పు.. 11 మందికి పదేళ్లు జైలు శిక్ష

Nia

Nia

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ కోర్టు నిందితులకు శిక్షలు ఖరారు చేసింది. మొత్తం 11 మంది నిందితులకు పదేళ్ల చొప్పున శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్ట్ ఇవాళ తుది తీర్పును ఇచ్చింది. ఈ కుట్ర వెనుక కీలక సూత్రధారి ఉబెర్ ఉర్ రెహమాన్‌తో పాటు మరో 10 మందికి న్యాయస్థానం శిక్ష వేసింది. హైదరాబాద్‌లో పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించాలని ప్రయత్నించిన ఈ గ్యాంగ్ .. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్ధాలు తీసుకొచ్చింది. అయితే దీనిని ముందే పసిగట్టిన తెలంగాణ పోలీసులు వీరి కుట్రను భగ్నం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులందరు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్నారు.

Read Also: ENG vs SL: ఈ 5 కారణాల వల్లే ఇంగ్లాండ్‌ ఓటమిపాలైంది.. అవేంటంటే?

అయితే, ముజాహిద్దీన్‌ కుట్రగా ఈ కేసు ప్రాచుర్యం పొందింది. ఇప్పటికే ఈ కేసులో సయ్యద్‌ ముక్బుల్‌ను సెప్టెంబర్‌ 22వ తేదీన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది. ఇక, ఈ కేసులో ఐదవ నిందితుడిగా ముక్బుల్ ఉన్నాడు. నాందేడ్‌కు చెందిన ముక్బుల్‌ను ఉగ్ర కదలికల నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్‌లోని కీలక సభ్యులతో ముక్బుల్‌ దగ్గరి సంబంధాలను కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.