Hyderabad: నేడు శ్రీరామనవమి శోభాయాత్ర.. నగరంలోని ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!

Rama

Rama

Sri Rama Navami Procession in Hyderabad: నేడు శ్రీరామనవమి. రాష్ట్రంలోని అన్ని రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలోనూ పెద్ద ఎత్తున వేడుకలు జరగనున్నాయి. నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా నిర్వహించనున్నారు.. ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్‌, ఆకాశ్‌పురి హనుమాన్ ఆలయం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో సుల్తాన్‌బజార్‌ హనుమాన్‌ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ డైవర్షన్లు ఉండనున్నాయి. ఈ శోభాయాత్రకు 3 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు..

READ MORE: Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. పండగ పూట ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!

ఇక ట్రాఫిక్ ఆంక్షల విషయానికి వస్తే.. సీతారాంబాగ్ బోయగూడ కమాన్ నుంచి వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లించనున్నారు. మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పురానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్‌వాడీ జంక్షన్ వైపు మళ్లించనున్నారు. ఎంజే బ్రిడ్జ్, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలు జుమ్మేరాత్ బజార్ మీదుగా వాహనాలను డైవర్ట్ చేస్తారు. అబిడ్స్ జీపీఓ, సుల్తాన్ బజార్, కోఠి, అబిడ్స్ ప్రధాన రోడ్ల వద్ద ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేస్తారు. బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, కోఠి, కాచిగూడ, అబిడ్స్ ప్రాంతాల్లో శోభాయాత్ర సజావుగా సాగేందుకు వాహనదారులు పోలీసులకు సహకరించాలని, సాధ్యమైనంత వరకు యాత్ర సాగే మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్జప్తి చేశారు. ఈ ఏరియాల్లో వెళ్లే వ్యక్తులు జాగ్రత్తలు వహించండి. పోలీసుల సూచనల మేరకు ప్రత్నామ్నాయ దారులు ఎంచుకోండి.