Site icon NTV Telugu

HYDRA: వరద ముప్పు తప్పించిన హైడ్రాపై కాలనీవాసుల ప్రశంసలు.. ప్లకార్డులతో మానవహారం..!

Hydra

Hydra

HYDRA: వరద ముప్పు తప్పించిన హైడ్రాకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. అభినందనల ప్లకార్డులతో అమీర్‌పేట‌, ప్యాట్నీ పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. మైత్రివనం వద్ద హైడ్రాకు మద్దతుగా మానవహారం కార్యక్రమం చేపట్టారు. 5 సెంటీమీటర్ల వర్షానికే మునిగిపోయే కాలనీలకు హైడ్రా ఉపశమనం కల్పించిందన్నారు. 15 సెంటీమీటర్ల వర్షం కురిసినా నీరు నిలవలేదని నివాసితుల ఆనందం వ్యక్తం చేశారు.. అమీర్‌పేట, శ్రీనివాస్‌నగర్‌, గాయత్రినగర్‌, కృష్ణనగర్‌, అంబేద్కర్‌నగర్ ప్రజలు హైడ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. భూగర్భ పైపులైన్లలో పూడిక తీయడంతో డ్రైనేజీ సమస్యలు తీరాయని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యక్షంగా పర్యటించి బాధ్యతలు హైడ్రాకు అప్పగించారని స్థానికులు చెప్పారు..

READ MORE: Mohanlal : మలయాళ సినిమా రికార్డులు తిరగరాస్తున్న మోహన్ లాల్ అండ్ సన్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షణలో సమస్యల పరిష్కారం జరిగిందని ప్రజలు వివరించారు. హైడ్రా వ్యవస్థను తెచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్యాట్నీ నాలాను విస్తరించి ఏడెనిమిది కాలనీలకు వరద ముప్పు నివారణ తొలగించాలన్నారు.
ప్యాట్నీ వద్ద 15 అడుగుల నాలా ఇప్పుడు 70 అడుగుల వెడల్పులోకి విస్తరణ జరిగిందన్నారు.. 30 ఏళ్ల సమస్యను హైడ్రా పరిష్కరించిందని నివాసితుల ప్రశంసల వర్షం కురిపించారు.. ఏటా వర్షం సమయంలో కార్లు మునిగిపోయే పరిస్థితులు ఈసారి లేకపోవడంపై సంతోషం వ్యక్తం చేశారు..

Exit mobile version