Site icon NTV Telugu

Rain Alert : హైదరాబాద్ వాసులారా… జాగ్రత్తగా ఉండండి!

Heavy Rains

Heavy Rains

Rain Alert : తెలంగాణలో వాతావరణం తేలియాడుతోంది. ఎప్పుడు ఎండలు పీక్ స్టేజ్‌లో ఉంటాయో, ఎప్పుడు ఆకస్మికంగా వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం తర్వాత తీవ్రమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయని, మరో కొద్ది సేపట్లో వర్షం పడే అవకాశముందని చెప్పారు.

Tata vs MG: భారతీయ దిగ్గజ కంపెనీ టాటాకు సవాల్ విసురుతున్న చైనా కంపెనీ..?

నగరంలోని తూర్పు, ఉత్తర భాగాలైన మల్కాజ్‌గిరి, తార్నాక, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో తీవ్ర తుఫానులు వస్తాయని అంచనా. అంతేగాక, కోర్ సిటీలో కూడా భారీ వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బయటకు వెళ్లాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైందని సమాచారం.

Vijayawada: బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా? అయితే, ఇది మీ కోసమే..!

Exit mobile version