Hyderabad: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని ఇబ్బందులతో ఇంటి నుంచి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తిని ఫిర్యాదు అందిన ఒక గంట వ్యవధిలోనే టెక్నాలజీ సహకారంతో గుర్తించి.. నిండు ప్రాణాన్ని జగద్గిరిగుట్ట పోలీసులు కాపాడారు. బీరప్ప నగర్‌కు చెందిన మాలంపాక బాబీ (28) అనే వ్యక్తి సోమవారం మధ్యాహ్నం కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో ఇంట్లో నుంచి డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. అనంతరం తన బావమరిదికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. వెంటనే అతని భార్య తెలిసిన వారిని సంప్రదించగా.. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించిన జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్ అతని సెల్ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేసి సికింద్రాబాద్‌లో మహంకాళి ఏరియాలో ఉన్నట్లు గుర్తించి వెంటనే సిబ్బందిని పంపించి ఫిర్యాదుదారున తో పాటు వెతకగా ఓ లాడ్జ్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. జగద్గిరిగుట్ట సిబ్బంది హుటాహుటినా అతని వద్దకు చేరుకున్నారు. అప్పటికే దోమల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా గుర్తించి గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి టెక్నాలజీ సహకారంతో నిండు ప్రాణం కాపాడటంలో చాకచక్యంగా వ్యవహరించిన జగద్గిరిగుట్ట సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు, సీఐ క్రాంతి కుమార్ అభినందించారు.
Read Also: Crime: పనికోసం వచ్చిన గిరిజన బాలికపై భూయజమాని అత్యాచారం.. గర్భం దాల్చడంతో అబార్షన్!
ఈ ఘటనను మరవకముందే.. ఇదే తరహాలో మరో ఘటన చోటచేసుకుంది. మళ్లీ టెక్నాలజీ సాయంతోనే ఆ యువకుడి ప్రాణాలను కూడా జగద్గిరిగుట్ట పోలీసులు కాపాడారు. పోచారం సతీష్ గౌడ్(25) s/o విష్ణువర్ధన్ గౌడ్ ఆల్విన్ కాలనీ సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 01:12 గంటలకు తన మిత్రులకు ఐ మిస్ యూ అని వాట్సాప్ లో మెసేజ్ పెట్టగా.. మిత్రులు ,అతని తల్లిదండ్రులకు చెప్పడంతో పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్ అతని సెల్ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేసి కూకట్‌పల్లి దగ్గరలోని కైత్లాపూర్‌లో ఉన్నట్లు గుర్తించి వెంటనే సిబ్బందిని పంపించి ఫిర్యాదుదారునితో పాటు వెతకగా.. అక్కడ గ్రౌండ్‌లో తన కారులో మణికట్టును కోసుకొని, చాలా రక్తం కారిపోయి స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. జగద్గిరిగుట్ట సిబ్బంది కారు అద్దాలు పగుల గొట్టి అతడిని యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి టెక్నాలజీ సహకారంతో నిండు ప్రాణం కాపాడటంలో చాకచక్యంగా వ్యవహరించిన జగద్గిరిగుట్ట సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు, సీఐ క్రాంతి కుమార్ అభినందించారు.