Police Raid: హైదరాబాద్ పోలీసులు, ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (FRRO) కలిసి అక్రమంగా నివసిస్తున్న ఆఫ్రికా దేశస్తులను గుర్తించి వారిని తిరిగి వారి దేశాలకు పంపిస్తున్నారు. ఆగష్టు 14న బాకారం ప్రాంతంలో అనుమతులు లేకుండా ఆఫ్రికన్ దేశస్తులు ఒక పుట్టినరోజు పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ఫాంహౌస్‌పై దాడి చేసి మొత్తం 51 మంది విదేశీయులను గుర్తించారు. వారిలో 14 మంది పురుషులు, 37 మంది మహిళలు ఉన్నారు. వీరు ఉగాండా, నైజీరియా, లైబీరియా, బోట్స్‌వానా, కెన్యా, కెమరూన్, మొజాంబిక్, జింబాబ్వే, ఘనా, మాలవి దేశాలకు చెందినవారుగా గుర్తించారు.
51 మందిలో 36 మంది ఎలాంటి చెల్లుబాటు అయ్యే వీసా లేకుండా అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. వారిలో 7 మంది పురుషులు, 29 మంది మహిళలు ఉన్నారు. పోలీసులు ఈ సమాచారాన్ని వెంటనే ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులకు తెలియజేశారు. ఇప్పటివరకు అక్రమంగా నివసిస్తున్న 36 మందిలో 24 మందిని వెనక్కి పంపించారు. మిగిలిన 12 మందిని కూడా పంపించేందుకు వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని, వారి దేశాల రాయబార కార్యాలయాల నుండి వన్ టైమ్ ట్రావెల్ డాక్యుమెంట్ తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Election Code Cash Limit: అమలులో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్.. రూ.50,000 నగదు మాత్రమే అనుమతి
