Hyderabad: భాగ్యనగరంలో గన్ కల్చర్ కలకలం.. పంజాగుట్ట బార్లో రివాల్వర్‌తో బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: శాంతిభద్రతలకు మారుపేరైన భాగ్యనగరంలో రోజురోజుకూ ‘గన్ కల్చర్’ పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చిన్నపాటి వివాదాలకే తుపాకులు బయటకు తీసి ప్రాణాల మీదకు తెస్తున్నారు. పోలీసులు అక్రమ ఆయుధాలపై నిరంతరం నిఘా ఉంచి కట్టడి చేస్తున్నప్పటికీ, ఎక్కడో ఒకచోట నిత్యం తుపాకులు బయటపడుతూనే ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం సైదాబాద్ పరిధిలో తుపాకులతో సంచరిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకోగా, నిన్నటికి నిన్న గంజాయి స్మగ్లర్ల నుంచి రెండు ఆటోమేటిక్ వెపన్స్‌ను సీజ్ చేశారు. ఆ ఘటనలు మరువకముందే, తాజాగా నగర నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట పరిధిలోని ఓ బార్లో ఓ యువకుడు రివాల్వర్‌తో హల్చల్ చేయడం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది.
క్షణికావేశంలో తుపాకీతో బెదిరింపులు
సోమాజిగూడలోని ‘హెడ్‌క్వార్టర్స్ బార్ & రెస్టారెంట్’లో ఈ ఘటన చోటుచేసుకుంది. బిల్లు చెల్లింపు వ్యవహారంలో బార్ సిబ్బందికి, కస్టమర్‌గా వచ్చిన మహమ్మద్ షానవాజ్ (24) అనే యువకుడికి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు.. బార్ బయట పార్క్ చేసిన తన మహీంద్రా థార్ వాహనం వద్దకు వెళ్లాడు. కారులో ఉన్న రివాల్వర్‌ను తీసుకొచ్చి నేరుగా బార్లోకి ప్రవేశించాడు. బిల్లు డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే కాల్చి పారేస్తానంటూ కస్టమర్లు, బౌన్సర్ల వైపు రివాల్వర్ గురిపెట్టి తీవ్ర హెచ్చరికలు చేశాడు. బార్లో ఒక్కసారిగా తుపాకీ కనిపించడంతో అక్కడున్న కస్టమర్లు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు.
Also Read
- Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
- Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
- Basit Ali: 'తిలక్ వర్మనే అసలైన హీరో'.. తెలుగు తేజంపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు..
- Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
తప్పిన పెను ప్రమాదం.. నిందితుడి అరెస్ట్
నిందితుడు షానవాజ్ కాల్పులకు తెగబడే ప్రమాదం ఉందని గుర్తించిన బౌన్సర్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ప్రాణాలకు తెగించి అతడిని అడ్డుకుని, చేతిలోని రివాల్వర్‌ను లాక్కుని బంధించారు. బౌన్సర్లు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అనంతరం బార్ యాజమాన్యం డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు నిందితుడు మహమ్మద్ షానవాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రివాల్వర్‌తో పాటు, ఘటనా స్థలంలో ఉన్న థార్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బార్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఆర్మ్స్ యాక్ట్‌తో పాటు పలు తీవ్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
నగరంలో వరుసగా తుపాకులు బయటపడుతుండటం పోలీసు శాఖకు సవాలుగా మారింది. సైదాబాద్ వేట ముఠా మొదలుకొని గంజాయి స్మగ్లర్లు, తాజా బార్ గొడవ వరకు ఆయుధాల విక్రయాలు తెరవెనుక జోరుగా సాగుతున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. షానవాజ్ చేతికి ఈ రివాల్వర్ లైసెన్స్ ఉన్నదా? లేక బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా కొనుగోలు చేశాడా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. నగరంలో పెరుగుతున్న ఈ అక్రమ ఆయుధాల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకిలించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: భాగ్యనగరంలో గన్ కల్చర్ కలకలం.. పంజాగుట్ట బార్లో రివాల్వర్‌తో బెదిరింపులు..
-
Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
-
Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
-
Basit Ali: ‘తిలక్ వర్మనే అసలైన హీరో’.. తెలుగు తేజంపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు..
-
Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!