Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని టోలిచౌకి పోలీసు స్టేషన్ పరిధిలో దిగ్భ్రాంతికర సంఘటన వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, నిర్బంధించి, చివరకు వ్యభిచార గృహానికి విక్రయించిన అమానుష ఘటన నగరంలో కలకలం రేపింది. సెప్టెంబర్ 2న ప్రధాన నిందితుడైన షేక్ అతీఫ్ అనే యువకుడు సదరు బాలికను ఆటోలో టోలిచౌకి నుంచి అత్తాపూర్ ప్రాంతానికి అపహరించుకుపోయాడు. అనంతరం ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా, అత్తాపూర్ లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న సబియా బేగం అనే మహిళకు కేవలం రూ. 30,000 కు విక్రయించాడు.
అక్కడితో ఆగకుండా.. నిందితులు నెల రోజులకు పైగా ఆ బాలికను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టి క్రూరంగా లైంగిక దోపిడీకి పాల్పడ్డారు. ఎన్నో ఆంక్షలు, తీవ్ర నిర్బంధం మధ్య నరకం అనుభవించిన బాధితురాలు, అక్టోబర్ 5న ఎంతో ధైర్యంతో నిందితుల చెర నుంచి తప్పించుకోగలిగింది. నేరుగా తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుని జరిగిన దారుణాన్ని వివరించడంతో, వారు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి, ప్రధాన నిందితులు షేక్ అతీఫ్, సబియా బేగంతో పాటు ఈ క్రూరత్వంలో భాగస్వాములైన మొత్తం ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మహిళలు, మైనర్ పిల్లల రక్షణపై ఆందోళన రేకెత్తించిన ఈ ఘోర ఘటనపై పోలీసులు కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!