Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు తాజాగా మెట్రో అధికారులు శుభవార్త అందించారు. నేడు (2న) ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. గురువారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈ సందర్బంగా ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: Baahubali: బాహుబలి మళ్ళీ వస్తున్నాడు.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఉప్పల్ మార్గంలో వెళ్లే మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లు అర్ద రాత్రి 12:15 చివరి ట్రైన్ బయలు దేరి 1:10 వరకు చివరి టర్మినల్స్ కు చేరుకొందని మెట్రో అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఐపీఎల్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగినా హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
Also Read: Kharge: ప్రధాని మోడీకి ఖర్గే లేఖ.. దేనికోసమంటే..!
ఇక మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వచ్చే క్రికెట్ అభిమానుల రద్దీ దృష్ట్యా గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం దగ్గరకు అభిమానుల కోసం ఏకంగా 60 అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ అధికారులు తెలిపారు. ఈ బస్సులు అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు కూడా ఏర్పాటు చేయనున్నారు.