Site icon NTV Telugu

Hyderabad: నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. కత్తితో పొడిచి దారుణ హత్య.. కేసులో బిగ్‌ట్విస్ట్ ..!

Murder

Murder

Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డులో యువకుడిపై కత్తి దాడి కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో బిగ్‌ట్విస్ట్ బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్‌ కి చెందిన రోషన్‌సింగ్‌(25) ఓ రౌడీషీటర్‌. జగద్గిరిగుట్ట పరిధి సోమయ్యనగర్‌కు చెందిన బాలశౌరెడ్డి(23) సైతం పాత నేరస్థుడు. రోషన్‌సింగ్‌ 15 రోజుల క్రితం ఓ ట్రాన్స్‌జెండర్‌ను మాట్లాడుకుని రంగారెడ్డినగర్‌లోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. డబ్బులు చెల్లించే విషయంలో ఇరువురి మధ్య గొడవ తలెత్తింది. దీంతో ఆ ట్రాన్స్‌జెండర్ బాలానగర్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం రోషన్, అతని మిత్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన శత్రువు బాలశౌరెడ్డి ట్రాన్స్‌జెండర్‌తో కేసు పెట్టించాడని రోషన్ అనుమానం వ్యక్తం చేశారు. ఎలాగైన చంపేస్తానని మిత్రులతో చెప్పేవాడు. ఈ విషయం కాస్త బాలశౌరెడ్డికి తెలిసింది. వాడు నన్ను చంపడం ఏంటి నేనే వాడిని చంపేస్తానని బాలశౌరెడ్డి ఫిక్స్‌ అయ్యాడు.

READ MORE:Thalaivar173 : రజనీకాంత్ హీరోగా.. కమల్ హాసన్ నిర్మాతగా దర్శకుడు ఎవరంటే?

ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం రోషన్‌సింగ్, బాలశౌరెడ్డి, స్నేహితులు ఆదిల్, మహ్మద్‌ కలిసి మద్యం తాగారు. గొడవ పెట్టుకుంటూ జగద్గిరిగుట్ట చివరి బస్టాపు వద్దకు చేరుకున్నారు. ఉన్నట్టుండి రోషన్‌ను మహ్మద్‌ పట్టుకోగా బాలశౌరెడ్డి కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. అనంతరం బైకుపై సిద్ధంగా ఉన్న ఆదిల్‌తో కలిసి బాలశౌరెడ్డి పారిపోయాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే విచక్షణ రహితంగా పొడిచాడు బాలశౌరెడ్డి. ఇది చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE: Sudheer Babu : ‘బాహుబలి’ రేంజ్ కాన్సెప్ట్‌తో కొత్త మూవీకి సైన్ చేసిన సుధీర్ బాబు!

Exit mobile version