Uttam Kumar Reddy: రాష్ట్రంలో LPG సంక్షోభం.. కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad LPG Auto Crisis: హైదరాబాద్‌లో ఎల్‌పీజీ (LPG) ఆటోరిక్షాలు ఎదుర్కొంటున్న గ్యాస్ కొరతపై కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అదనపు ఎల్‌పీజీ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గృహ అవసరాల కోసం డొమెస్టిక్ ఎల్‌పీజీ సరఫరా 100% కొనసాగించాలని కోరారు. కమర్షియల్ ఎల్‌పీజీ పంపిణీపై కేంద్ర మార్గదర్శకాలు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఆటో ఎల్‌పీజీ రంగం తీవ్రంగా ప్రభావితమైందన్నారు.
READ MORE: Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తెలంగాణలో సుమారు 1 లక్ష ఎల్‌పీజీ ఆటోరిక్షాలు రోడ్లపై నడుస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల (IOCL, HPCL, BPCL) వాటా కేవలం 20% మాత్రమే ఉంది. ప్రైవేట్ కంపెనీలు 80% మార్కెట్‌ను ఆక్రమించాయి. రాష్ట్రవ్యాప్తంగా 110 ప్రైవేట్ ఎల్‌పీజీ ఔట్‌లెట్లు ఉన్నాయి. రోజుకు సుమారు 55 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్‌పీజీ కొరత ఏర్పడింది. అనేక ప్రైవేట్ ఔట్‌లెట్లు డ్రై అవుట్ పరిస్థితి నెలకొంది. ప్రజా రవాణాలో అంతరాయం, ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది. ప్రైవేట్ కంపెనీలకు PSUల నుంచి సరఫరా అంతరాయం ఏర్పడిందని లేఖలో మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ ఔట్‌లెట్లలో ఆటో ఎల్‌పీజీ అందుబాటు ఉంచాలని విజ్ఞప్తి చేశార. ప్రైవేట్ కంపెనీలకు తక్షణ సరఫరా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఔట్‌లెట్లలో లీటర్‌కు రూ.75, ప్రైవేట్ ఔట్‌లెట్లలో లీటర్‌కు రూ.93 వరకు విక్రయిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై నియంత్రణ చర్యలు అవసరమని.. కేంద్రం తక్షణ జోక్యం వల్ల ప్రజా రవాణా సేవలు నిలకడగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!