Site icon NTV Telugu

వీడియో డేటింగ్‌లలో అగ్రస్థానంలో హైదరాబాద్

కరోనా మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ యాప్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఎడ్యుకేషన్, ఫుడ్, న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా రంగాల యాప్‌లతో పాటు వీడియో డేటింగ్‌ యాప్‌లకు కూడా గిరాకీ ఏర్పడింది. వీడియో డేటింగ్‌లు చేసుకుంటున్న నగరాలలో చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పాటు హైదరాబాద్‌ కూడా ఉంది. డేటింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు డేటింగ్ జపం చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఏ పని కావాలన్నా అందరూ వీడియో కాల్స్‌ను ఆశ్రయిస్తున్నారు.

Read Also: ఇది రైల్వే స్టేష‌న్ కాదు… ఎయిర్‌పోర్టే

అలాగే డేటింగ్ చేసుకునే ప్రియులు కూడా వీడియో డేటింగ్ యాప్‌లను వాడేస్తున్నారు. ఇలా డేటింగ్ యాప్‌లను అత్యధికంగా వాడుతున్న భారతీయ నగరాలలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నట్లు ఇటీవల ‘టిండర్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ జాబితాలో హైదరాబాద్ తర్వాతి స్థానంలో చెన్నై, బెంగళూరు నగరాలు ఉన్నాయి. అయితే డేటింగ్ చేసుకునే వాళ్లు ఒకరినొకరు నిజంగా తెలుసుకోవడంలో సహాయపడే కార్యకలాపాలను ఎంచుకుంటున్నారు. సైక్లింగ్, లాంగ్ వాక్, లంచ్, డిన్నర్ అనే పదాలను డేటింగ్‌లో ఎక్కువగా వాడుతున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version