NTV Telugu Site icon

HMWSSB : హైదరాబాద్ ప్రజలకు అలర్ట్‌.. రెండు రోజులు నీళ్లు బంద్‌

Hmwssb

Hmwssb

HMWSSB : హైదరాబాద్ మహానగర జలమండలి (HMWSSB) గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద మరమ్మతులు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 17న (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 18న (మంగళవారం) ఉదయం 6 గంటల వరకు ఈ పనులు జరగనున్నాయి. ఈ సమయంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.

పంపింగ్ స్టేషన్ వద్ద చేపట్టనున్న పనులు:

3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కు 900 ఎంఎం డయా వాల్వులు (బీఎఫ్ & ఎన్ఆర్సీ) అమర్చనున్నారు. మొత్తం 24 గంటల పాటు మరమ్మతులు కొనసాగుతాయి.

నీటి సరఫరా నిలిచిపోనున్న ప్రాంతాలు:

🔹 ఓ అండ్ ఎం డివిజన్-6: ఎస్.ఆర్.నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగళ్ రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్.

🔹 ఓ అండ్ ఎం డివిజన్-9: కూకట్పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మ బండ, మూసాపేట్, భరత్ నగర్, మోతీ‌నగర్, గాయత్రి నగర్, బాబా‌నగర్, కేపీహెచ్ బీ, బాలాజీ నగర్, హస్మత్ పేట్.

🔹 ఓ అండ్ ఎం డివిజన్-12: చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారం, సూరారం, ఆదర్శ్ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ.

🔹 ఓ అండ్ ఎం డివిజన్-13: అల్వాల్, ఫాదర్ బాలయ్య నగర్, వెంకటాపురం, మచ్చ బొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్‌పేయ్ నగర్, యాప్రాల్, చాణిక్యపురి, గౌతమ్ నగర్, సాయినాథపురం.

🔹 ఓ అండ్ ఎం డివిజన్-14: చెర్లపల్లి, సాయిబాబా నగర్, రాధిక.

🔹 ఓ అండ్ ఎం డివిజన్-15: కొండాపూర్, డోయెన్స్, మాదాపూర్ (కొన్ని ప్రాంతాలు).

🔹 ఓ అండ్ ఎం డివిజన్-17: హఫీజ్ పేట్, మియాపూర్.

🔹 ఓ అండ్ ఎం డివిజన్-21: కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం.

🔹 ఓ అండ్ ఎం డివిజన్-22: నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం.

🔹 ట్రాన్స్ మిషన్ డివిజన్-4: ఎంఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్ రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బీబీనగర్ ఎయిమ్స్.

🔹 ఆర్‌డబ్ల్యూ ఎస్ ఆఫ్ టేక్స్ ప్రాంతాలు: ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి), ఘన్ పూర్ (మేడ్చల్/ శామీర్ పేట్).

HMWSSB అధికారులు ప్రజలను ముందస్తుగా నీటి నిల్వలు చేసుకోవాలని, ఈ అసౌకర్యానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Minister Kollu Ravindra: తప్పు చేసి తప్పించుకోవడం కోసం మళ్ళీ తప్పు చేసి దొరికాడు