Site icon NTV Telugu

Hyderabad: చీకటి పడితే చాలు.. రేసింగ్‌లు, స్టంట్‌లతో భయాందోళనలో వాహనదారులు!

Hyd

Hyd

Hyderabad: హైటెక్‌ సిటీ.. ఈ ఏరియాకి వెళ్తే.. ముఖ్యంగా నైట్‌ టైమ్‌.. మనం హైదరాబాద్‌లోనే ఉన్నామా..? లేక వేరే దేశంలో ఉన్నామా అనిపిస్తుంటుంది. కళ్లు జిగేల్‌మనాల్సిందే.. ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రాంతం.. రాత్రైతే చాలు పోకీరీల చేతిలో బంధీ ఐపోతోంది. ఇన్‌స్టా రీల్స్‌ అని.. స్నాప్‌ లనీ.. బైక్, కార్‌ రేసింగ్‌లు అని.. ఇవి చాలవన్నట్టు ఆటోలు వేసుకుని మరికొందరు.. రచ్చరచ్చ చేస్తున్నారు. రాత్రైతే చాలు ఒకటే గోలగోల. అటువైపుగా వెళ్లాలంటేనే.. వాహనాదారులకు ధడ పుడుతోంది. ఇంతజరుగుతున్నా.. పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు..?

ఇదేదో కాలేజ్‌ ఫెస్టో… యూత్‌ గెట్ టుగెదరో… అనుకుంటే పొరపాటు !! ప్యూర్‌లీ అన్‌ ఆర్గనైజ్డ్‌గా పోకిరీలు చేస్తున్న రచ్చ రంబోలా! ఎందుకు వస్తున్నారో… ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో… వచ్చి ఏం చేస్తున్నారో… ఎందుకు ఆ కేకలు, ఎందుకు ఆ ఆరుపులు.. ఏం అర్థం కాదు.

Nellore M*urder: కడుపులో, గొంతుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి భార్యను హతమార్చిన భర్త!

అమ్మాయి, అబ్బాయి.. డ్యూయెట్‌ సాంగ్‌లకు డ్యాన్స్‌ లేస్తుంటారు. ఇది చూస్తూ.. అబ్బాయిలు ఈలలు, కేకలు. పక్కనే మరో బ్యాచ్‌… పోకిరీలు స్టెప్పులేస్తుంటారు. ఆ పక్కనే బైక్‌లు, కార్లతో స్టంట్‌లు ! ఓ బైక్‌ గాల్లో లేస్తుంటే… మరో బైక్‌ రోడ్డుపై ఈడ్చుకుంటూ వస్తుంటుంది. రయ్యుమని దూసుకొచ్చే కార్లు… !! అవి రోడ్డుపై దూసుకెళ్తున్నాయా..?? మనుషుల మీదకు వస్తున్నాయా..? అర్థం కాదు. ఇవి చాలదన్నట్టు.. ఆటోలు. ఉండేవే మూడు టైర్లు… అందులో రెండు గాల్లోనే ఉంటాయి. రోడ్డు మీద బొంగరంలా గింగిరాలు కొడుతుంటాయి ఆటోలు.

ఇదేదో అవగాహనా కార్యక్రమంలా.. సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం. అద్భుతమైన మాజానిచ్చే వీకెండ్‌ స్పాట్‌ కావాలా..? ఇదే అంటూ… లొకేషన్‌, అడ్రస్‌తో సహా పోస్ట్‌ చేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు.. మరో బ్యాచ్‌. ఫొటోలు, వీడియోలు తీస్తాం. రీల్స్‌ కూడా తీస్తాం. ఎడిటింగ్ కూడా ఫ్రీగా చేసి ఇస్తాం అంటూ… ప్రమోట్‌ చేసుకుంటున్నారు.

సాఫ్ట్ వేర్‌ కంపెనీలతో.. ప్రశాంతంగా ఉండే హైటెక్‌ సిటీ, రాయదుర్గం, మాదాపూర్‌ ప్రాంతాలు… ఇప్పుడు పోకిరీలతో రచ్చరచ్చగా మారాయి. ఆ రూట్‌లో వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురై.. అటువైపుగా ప్రయాణాన్నే మానుకుంటున్నారు. ఆఫీసులో పనిచేసుకునే టెక్కీలు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. అంతే కాదు వీకెండ్స్‌లో రాత్రిపూట పోకిరీలే రోడ్డుకు అడ్డంగా బారికేడ్స్ పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అటు వైపు వాహనదారులు ఎవరూ రాకుండా ఏకంగా రోడ్డునే నాలుగు వైపులా బ్లాక్ చేస్తున్నారంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతోంది.

Sun Massive Explosion : సూర్యుడిపై 17 భారీ పేలుళ్లు.. భూమికి పొంచి ఉన్న డేంజర్ ఇదే.!

వీకెండ్స్‌లో ఇంత రచ్చ జరుగుతున్న ఆ ప్రాంతానికి… రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఐనా పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు.. పట్టించుకోవడం లేదు. అంత పెద్ద సంఖ్యలో జనం వస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని టెకీలు ప్రశ్నిస్తున్నారు. రాత్రి పూట విధులు నిర్వర్తించే తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని చెబుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే.. ఆ రెండు రోజులు హడావుడి చేస్తారు పోలీసులు. మళ్లీ యాథావిదే అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Exit mobile version