Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Immersion: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు, జీహెచ్ఎంసీ, జలమండలి, టీజీఎస్ ఆర్టీసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు, గణేష్ విగ్రహాలు తరలివచ్చే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు, ప్రత్యేక బందోబస్తు, రవాణా ఏర్పాట్లు చేశారు.
చార్మినార్, బేగం బజార్, గోషామహల్ ప్రాంతాల నుంచి వచ్చే గణేష్ విగ్రహాలకు MJ మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్ వైపు మార్గం ఏర్పాటు చేశారు. బాలాపూర్, చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా విగ్రహాలు కూడా ఇదే మార్గంలో వెళ్లనున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నారు. కూడలిలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పహారా కాస్తున్నారు.
Also Read
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
- itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
మరోవైపు నిమజ్జనం కోసం 110 స్టాటిక్ క్రేన్లు, 170 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశారు. పీపుల్ ప్లాజాలో 9, ఎన్టీఆర్ మార్గ్‌లో 10 క్రేన్లు అందుబాటులో ఉంచారు. పోలీసులతో సమన్వయం కోసం 12 జాయింట్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గంలో ప్రతి 3-4 కిలోమీటర్లకు గణేశ్ యాక్షన్ టీమ్‌లను నియమించారు. నిమజ్జన కేంద్రాల వద్ద 24 గంటల పాటు 770 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహించనున్నారు. చెత్త తొలగింపు కోసం మొత్తం 6 వేల మంది స్వీపింగ్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఇంకా 287 మొబైల్ టాయిలెట్లు, 4.91 లక్షల చెత్త సేకరణ సంచులు, 43,270 తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు.
అలాగే భక్తుల కోసం 137 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేశారు. 90 బేబీ పాండ్స్ వద్ద కూడా తాగునీటి సదుపాయం కల్పించారు. ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్ పరిసరాల్లో 12 ప్రత్యేక వాటర్ క్యాంపులు ఏర్పాటు చేయగా.. మొత్తం 40 లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచారు.
కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఖైరతాబాద్‌లో 523 మంది అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఇందులో ఆరుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 15 ప్లాటూన్లు, 266 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. షీ టీమ్, పుషింగ్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, పికెటింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తుల రవాణా కోసం టీజీఎస్ ఆర్టీసీ 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులను నడపనుంది. హుస్సేన్ సాగర్ పరిసరాల నుంచి నగరంలోని వివిధ రూట్లకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
ట్రాఫిక్ డైవర్షన్ల నేపథ్యంలో 44 కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు, కంట్రోలర్లను నియమించారు. ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు జోనల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇందిరా పార్క్, వి.వి. విగ్రహం వద్ద రిలీఫ్ వాహనాలను అందుబాటులో ఉంచారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, కోటి, బషీర్‌బాగ్, ఇందిరా పార్క్, AIR ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్టీసీ క్యాంపులు ఏర్పాటు చేశారు. బస్సులకు అత్యవసర మరమ్మతుల కోసం 113 మంది డ్రైవర్లు, 87 మంది మెకానిక్‌లను అందుబాటులో ఉంచారు.
తాజావార్తలు
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
-
Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!