Hyderabad: ముగ్గురూ.. స్నేహితులు ! పొట్టకూటి కోసం బీహార్ నుంచి హైదరాబాద్ వచ్చారు !! ముగ్గురూ ఒకేచోట పనిలో చేరారు. కలిసి పనిచేసుకుంటూ కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. అన్యోన్యంగా ఉన్న వారి మధ్య అనుమాన భూతం చిచ్చు పెట్టింది. తన భార్యపై కన్నేశాడని తెలుసుకుని స్నేహితుడిని మందలించాడు..!! పలుమార్లు హెచ్చరించాడు..!! ఐనా తీరు మార్చుకోకపోవడంతో కక్షగట్టి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని మూసీ కాలువలో పడేశాడు. అంబర్‌పేట్‌లో జరిగిన ఈ మర్డర్ మిస్టరీని తెలివిగా చేధించారు పోలీసులు.
READ MORE: Siachen Tragedy: సియాచిన్‌లో విషాదం.. ఆర్మీ అధికారులను బలిగొన్న మంచు
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో ఆగస్టు 21న పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ రాజుకి డయల్ 100 ద్వారా ఓ సమాచారం వచ్చింది. మూసీ ఒడ్డున ఉన్న డంప్‌యార్డ్ వద్దకు ఓ మృతదేహం కొట్టుకువచ్చిందని చెప్పారు. స్పాట్‌కి వెళ్లిన కానిస్టేబుల్ రాజు.. మృతదేహాన్ని గుర్తించి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఆధారాలు ఏవీ దొరకకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి మెడకు వైర్లు బిగించి ఉండటంతో… ఎవరో హత్య చేసి పడేసి ఉంటారని గుర్తించి.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో… అంబర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే… అంబర్‌పేట పీఎస్‌కి ఓ వ్యక్తి వచ్చాడు. తన స్నేహితుడు కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. ఫిర్యాదుతో ఇచ్చిన ఆధారాలు… మూసీలో దొరికిన మృతదేహంతో మ్యాచ్ అవడంతో.. పోలీసులు అనుమానించారు. మిస్ అయ్యాడని చెప్తున్న వ్యక్తి… అనుమానాస్పద స్థితిలో దొరికిన మృతదేహం ఆనవాళ్లు ఒకేరకంగా ఉన్నాయని గుర్తించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తికి మూసీ ఒడ్డున దొరికిన మృతదేహం ఫొటోలు చూపించారు. తాను వెతుకుతున్న వ్యక్తి ఇతనేనని…తనపేరు షోరబ్ అని చెప్పాడు. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు స్టార్ట్ చేశారు.
READ MORE: Best Buffalo Breed: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. రోజుకు 25 లీటర్లు ఇచ్చే ఈ గేదెలను కొనండి!
తీగ లాగితే డొంక కదిలింది. మర్డర్ మిస్టరీ వీడింది. షోరబ్‌ను తన స్నేహితులే పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి.. మూసీలో పారేసినట్లు గుర్తించారు పోలీసులు. బీహార్‌కి చెందిన మహ్మద్ జావేద్, అమీర్ హుల్ హక్, షోరబ్… ముగ్గురూ స్నేహితులు. బీహార్ నుంచి హైదరాబాద్‌కి వలస వచ్చారు. ముగ్గురూ ఒకేచోట పనిలో చేరారు. జావెద్, అమీర్ హుల్ హక్ ఇద్దరూ బోడుప్పల్ లోని కేవీ నగర్ పరిధిలోని ద్వారకా నగర్‌లో ఒకే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. జులైలో జావేద్ తన భార్య ముస్కన్‌తో కలిసి షోరబ్ ఉంటున్న ఇంట్లోనే అద్దెకు దిగాడు. స్నేహితుడు జావెద్ భార్య ముస్కన్‌తో అసభ్యంగా ప్రవర్తించసాగాడు షోరబ్. ముస్కన్ స్నానానికి వెళ్లినప్పుడు బాత్‌రూమ్ కిటికీలో నుంచి చూడసాగాడు. దీన్ని జావెద్ గమనించాడు. షోరబ్‌ను మందలించాడు. ముస్కన్‌కు అసభ్యకరంగా సైగలు చేయసాగాడు షోరబ్. ఈసారి కూడా జావెద్ హెచ్చరించాడు. ఐనా షోరబ్ తీరులో మార్పు లేదు. చేసేది లేక… ఇల్లు ఖాళీ చేసి స్నేహితుడు అమీర్ హుల్ హక్ ఇంటికి వెళ్లాడు. అక్కడే అద్దెకు దిగాడు. విషయాన్ని స్నేహితుడు అమీర్‌కి చెప్పాడు. ఎలాగైనా షోరబ్‌ను హత్య చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు జావెద్. షోరబ్ హత్యకు తాను కూడా సహకరిస్తానని చెప్పాడు అమీర్. షోరబ్ అంటే తనకు కూడా గిట్టదని… ఒకే చోట కలిసి పనిచేస్తున్నా… తనకు తెలియకుండా కాంట్రాక్ట్‌కి పనులు కుదర్చుకుంటున్నాడని అన్నాడు అమీర్..
READ MORE: Justice Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఫలితాలపై లేఖ విడుదల చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి..
అమీర్, జావెద్ ఇద్దరూ కలిసి షోరబ్ హత్యకు ప్లాన్ చేశారు. ఆగస్ట్ 20న మద్యం తాగుదాం రమ్మని షోరబ్‌ను మూసీ ఒడ్డు వద్ద ఉన్న ప్రదేశానికి పిలిచారు. ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. షోరబ్ మత్తులో ఉన్న సమయం చూసుకుని ఒక్కసారిగా దాడి చేశారు. ముందుగానే వెంట తెచ్చుకున్న వైర్లను షోరబ్ మెడకు బిగించి.. ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. షోరబ్ మృతదేహాన్ని మూసీలో పడేశారు. తమకేం తెలియనట్టు అక్కడి నుంచి వచ్చేశారు.. మిస్సింగ్ ఫిర్యాదుతో.. షోరబ్ మర్డర్ మిస్టరీ వీడింది. ముందుగా గుర్తు తెలియని వ్యక్తి మూసీలో కొట్టుకొచ్చినట్లు భావించినా.. పూర్తి దర్యాప్తు తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భార్యపై కన్నేశాడనే… స్నేహితుడు షోరబ్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు జావేద్. హత్యకు అమీర్ సహకరించినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. జావేద్, అమీర్ హుల్ హక్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు..
