Hyderabad: స్నాక్స్ తింటున్నారా..? డైరెక్ట్ యమలోకానికే.. 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Food Safety Raid: హైదరాబాద్ కాటేదాన్ సమీపంలోని ప్రేమావతి పేటలో టీజీ సేఫ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సాహిల్ ఫుడ్స్‌కు చెందిన 5 స్నాక్స్ తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టి తీవ్ర ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు. దీంతో 4 యూనిట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను సస్పెండ్ చేశారు. నిబంధనలు పాటించని 4 యూనిట్ల వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు.
ఈ దాడులలో సరైన లేబుల్స్ లేని 55 టన్నుల ఆహార పదార్థాలను సీజ్ చేశారు. వీటి మార్కెట్ విలువ రూ.33.94 లక్షలుగా అధికారులు తెలిపారు. నాణ్యతపై అనుమానాలతో 11 శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. తయారీ కేంద్రాల్లో వ్యర్థాలు పేరుకుపోవడం, వెంటిలేషన్ సరిగా లేకపోవడం, యంత్రాల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని అధికారులు గుర్తించారు. సిబ్బంది గుట్కా, పాన్ మసాలా నములుతూ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఆహార పదార్థాలను అపరిశుభ్రమైన నేలపై నిల్వ చేయడంతో పాటు, మురికి బకెట్లలో ప్రమాదకర సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు.
Also Read
ఉత్పత్తుల తయారీ, విక్రయాల రికార్డుల్లోనూ తీవ్ర లోపాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబర్, లేబుల్, ఎక్స్పైరీ తేదీని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ప్యాకింగ్ దెబ్బతిన్న లేదా సరైన వివరాలు లేని ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Hyderabad: స్నాక్స్ తింటున్నారా..? డైరెక్ట్ యమలోకానికే.. 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్..!
-
RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
-
Tirumala: అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!