Site icon NTV Telugu

Finance Scam: ఫైనాన్స్ ముసుగులో దారుణాలు.. వెలుగులోకి తండ్రీకొడుకుల బాగోతం..!

Finance

Finance

Finance Scam: హైదరాబాద్ బంజారాహిల్స్ కి చెందిన ఫైనాన్స్ వ్యాపారి సునీల్ కుమార్ ఓజా, అతని కుమారుడు ఆశిష్ కుమార్ ఓజా చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఫైనాన్స్ కి కోట్ల రూపాయలు ఇస్తూ వారి భూములను కాజేస్తున్నారు. సునీల్ కుమార్ ఓజా మొదట ఫైనాన్స్ కి డబ్బులు ఇస్తాడు.. అందుకు షూరిటీగా వారికి సంబంధించిన భూమి ఫ్లాట్స్ జిపిఏ లేదా రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఇక గడువు అనంతరం ఫైనాన్స్ తీసుకున్నవారు అసలు ఇంట్రెస్ట్ కలిపి చెల్లించిన కొంతమంది రెట్టింపు డబ్బులు చెల్లించినా కూడా తమ భూములను తిరిగి ఇవ్వడం లేదంటూ బాధితులు వాపోతున్నారు. ఈ ఫైనాన్సర్లు వేధింపులకు తాళలేక ఇప్పటికే అనేకమంది దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు.

Minister Anitha: ఓ మహిళ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడకూడదు.. రోజాపై హోంమంత్రి ఫైర్

మొకిలాకు చెందిన షేక్ ఫరీద్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి సునీల్ కుమార్ ఓజ వద్ద సుమారు 16 కోట్లు అప్పు తీసుకున్నాడు. అందుకుగాను షూరిటీగా తన వద్ద ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేశాడు. గడువు ముగిసిన అనంతరం ఇంట్రెస్ట్ తో కలిపి 20 కోట్లకు పైగా చెల్లించాడు. కానీ, రిజిస్ట్రేషన్ చేసుకున్న తన భూములను తిరిగి ఇవ్వలేదు. రెండేళ్లుగా తమ భూములు ఇవ్వాలంటూ అడుగుతున్నప్పటికీ తిరిగి తమనే బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ బాధితులు వాపోతున్నారు. వారి వద్ద ఉన్న రివాల్వర్ తో అనేకమార్లు బెదిరింపులకు పాల్పడ్డట్లు బాధితుడు విన్నవించుకున్నారు.

Lava Blaze Dragon 5G: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఆగయా.. రూ.9,999కే 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 5G ఫోన్!

ఇదే తరహాలో గుండ్ల పోచంపల్లికి చెందిన రఘునందన్ రెడ్డి అనే బాధితుడు కూడా సునీల్ కుమార్ చేతిలో మోసపోయాడు. వారి వద్ద రెండు కోట్లు అప్పు తీసుకుంటే అవి చెల్లించినా కూడా నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఫైనాన్స్ వల్ల ఆగడాలకు అడ్డు అదుపు లేదు. భారతి బిల్డర్స్ కూడా సునీల్ కుమార్ బాధితులే అని సమాచారం. ఇలా వందలాదిమంది ఫ్లాట్ ఓనర్స్ సునీల్ కుమార్ చేతిలో మోసపోయారు. గతంలో ఈ ఫైనాన్సర్ సునీల్ కుమార్ పై అనేక మోసం చేసిన కేసులు ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వందలాది మంది బాధితులను మోసం చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్న ఈ ఫైనాన్సర్ లపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Exit mobile version