Site icon NTV Telugu

Cyber Fraud: సైబర్ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల అంతర్రాష్ట్ర ఆపరేషన్

Cyber Frud

Cyber Frud

సైబర్ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 61 మందిని అరెస్ట్ చేశారు. ఒక్క ఆగస్టులోనే 338 ఫిర్యాదులు – వాటిలో 233 కేసులు నమోదయ్యాయి. ట్రేడింగ్ స్కాంలు, ఇన్వెస్ట్‌మెంట్, లోన్ ఫ్రాడ్స్, ఇన్సూరెన్స్, సోషల్ మీడియా, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. తమిళనాడు (20), గుజరాత్ (18), కర్ణాటక (16), మహారాష్ట్ర (13), ఢిల్లీ (13), ఆంధ్రప్రదేశ్ (7) మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాదులో 34 ఏళ్ల మహిళకు NSE & Coin SSDCX పేరుతో 1.05 కోట్ల మోసానికి పాల్పడ్డారు.

Also Read:Amit Shah: దశాబ్ద కాలంలో మోడీ చేసినంత అభివృద్ధి ఏ ప్రధానైనా చేశారా? జీఎస్టీని ప్రశంసించిన అమిత్ షా

FedEx scam lo – చైనా జాతీయుడు చెన్ చెన్ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. 73 ఏళ్ల వృద్ధుడికి ఫేక్ ట్రేడింగ్ యాప్ ద్వారా 22.5 లక్షల మోసం చేశారు. బంజారాహిల్స్‌ వ్యక్తికి ఫేక్ షేర్ మార్కెట్ WhatsApp గ్రూప్ తో మోసానికి పాల్పడ్డారు. నిందితులు Telegram గ్రూపులు, క్రిప్టో (USDT) ద్వారా డబ్బు తరలిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా, WhatsApp, Telegram లో వచ్చే నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే బెదిరింపులకు బలి కావద్దని సూచిస్తున్నారు.

Exit mobile version