Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!

Crime

Crime

Hyderabad Crime: హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మయన్మార్‌కు చెందిన ఓ మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్తతో సహా నలుగురిపై కంచన్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మయన్మార్‌కు చెందిన బాధితురాలిని బంగ్లాదేశ్‌కు చెందిన ఫయజ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ దంపతులు అక్రమంగా హైదరాబాద్‌కు వచ్చి కంచన్‌బాగ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

మద్యానికి బానిసైన ఫయజ్ తన స్నేహితులతో గడపాలంటూ భార్యపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ క్రమంలో ఆమెపై సామూహిక లైంగిక దాడి జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి భర్తతో పాటు మొత్తం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులంతా బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా విచారణలో తేలింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల పాత్రపై కంచన్‌బాగ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.